Babu Gogineni: సినీ వివాదంలోకి ‘గోనినేని’ ఎంట్రీ.. టార్గెట్ ఎవరంటే?

Babu Gogineni: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను తగ్గించడంతో కొద్దిరోజులుగా సినీ స్టార్స్ రగిలిపోతున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ వర్సెస్ ఏపీ సర్కారు అన్నట్లుగా సీన్ క్రియేట్ అయింది. ఏపీ మంత్రులు, సినిమా స్టార్స్ ఒకరిపై ఒకరు డైలాగ్స్ పేలుస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏం సమస్యలు లేవన్నట్లు అంతా సినిమా టికెట్ల ఇష్యూపైనే చర్చించుకుంటున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు సినీ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తెలంగాణ సర్కారు టాలీవుడ్ పరిశ్రమకు […]

Written By: NARESH, Updated On : January 6, 2022 2:56 pm
Follow us on

Babu Gogineni: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను తగ్గించడంతో కొద్దిరోజులుగా సినీ స్టార్స్ రగిలిపోతున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ వర్సెస్ ఏపీ సర్కారు అన్నట్లుగా సీన్ క్రియేట్ అయింది. ఏపీ మంత్రులు, సినిమా స్టార్స్ ఒకరిపై ఒకరు డైలాగ్స్ పేలుస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏం సమస్యలు లేవన్నట్లు అంతా సినిమా టికెట్ల ఇష్యూపైనే చర్చించుకుంటున్నారు.

కరోనా కారణంగా గత రెండేళ్లు సినీ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తెలంగాణ సర్కారు టాలీవుడ్ పరిశ్రమకు అండగా ఉంటుంగా దీనికి భిన్నంగా ఏపీ సర్కారు మాత్రం వ్యవహరిస్తోంది. ఒకరిద్దరి కోసం ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే వాదనలున్నాయి. దీంతో టికెట్ల ఇష్యూ ఏపీ సర్కార్ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా మారిపోయింది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండటం అయోమయ పరిస్థితికి దారితీస్తోంది.

ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లతో మొదలైన డైలాగ్ వార్ ను హీరో నాని, సిద్దార్థ, డైరెక్టర్ రాంగోపాల్ వర్మలు కంటిన్యూ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ మీడియా డిబేట్లలో చర్చిస్తూ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అలాగే ట్వీటర్లో మంత్రి పేర్ని నానికి 10ప్రశ్నలు సంధించగా ఆయన తనశైలికి భిన్నంగా సమాధానం ఇచ్చారు. అలాగే తనను కలిసేందుకు ఆర్జీవీ అపాయిమ్మెంట్ కూడా ఇచ్చారు. త్వరలోనే వీరిద్దరు బేటి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఏపీ మంత్రులు, సినీ స్టార్స్ మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలోనే సామాజికవేత్త, హేతువాతి, మేధావి అని తనకు తను ఫీలయ్యే బాబు గోగినేని మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో బాబు గోనినేని తెలుగు బిగ్ బాస్ షోలో పాపురాలిటీతోపాటు నెగిటీవీని సొంతం చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ, ఏపీ మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న డైలాగ్ వార్ పై గోగినేని తన దైన శైలిలో కౌంటర్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, కామెడీయన్ పృథ్వీరాజ్ లను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. ‘‘ఎన్నికల్లో స్పాన్సర్డ్ మిమిక్రీ సినిమాలను తీసేవాళ్లు ఆ మిమిక్రీ సినిమాల్లో సంబరంగా నటించే జర్నలిస్టులు, పదవులు ఆశించి ప్రచారం చేసిన హీరోలు, సీఎం నా బావ అంటూ చెప్పుకునే వారు, లెజండరీ పెదరాయుడును, వెనుక నుంచి పట్టుకొచ్చిన కమెడియన్స్ వీళ్ల కంటే ఎలక్షన్లలో ఫైనాన్స్ చేసి చివరికి వారి రొమ్ములపై గుద్దిచ్చుకున్న నిర్మాతలను వాడుకొని ఒక మంచి కామెడీ సినిమా తీయచ్చని’’ రాంగోపాల్ వర్మకు సలహా ఇచ్చాడు. ఈ సినిమా విడుదైతే ఎంచక్కా వోడ్కా తాగుతూ అంతా సినిమా చూస్తారంటూ సైటర్ వేశారు. బాబు గోగినేని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.