RRR Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా కొన్నిచోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం.
‘బీస్ట్’కి ప్లాప్ టాక్ రావడం, `కేజీఎఫ్ 2’ పై ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వంటి కారణాల కారణంగా ఆర్ఆర్ఆర్ కి బాగా కలిసి వచ్చింది. నేటికీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ను చూడటానికి ఎగబడుతున్నారు. మరి 27 రోజులకు గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 27 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’ డైలాగే.. పిచ్చెక్కించారుగా !
నైజాం 110.22 కోట్లు
సీడెడ్ 49.76 కోట్లు
ఉత్తరాంధ్ర 32.39 కోట్లు
ఈస్ట్ 15.97 కోట్లు
వెస్ట్ 12.74 కోట్లు
గుంటూరు 17.85 కోట్లు
కృష్ణా 14.34 కోట్లు
నెల్లూరు 09.15 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 27 రోజులకు గానూ 262.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 27 రోజులకు గానూ రూ. 1092 కోట్లను కొల్లగొట్టింది
తమిళనాడు 37.54 కోట్లు
కేరళ 10.41 కోట్లు
కర్ణాటక 42.85 కోట్లు
హిందీ 127.70 కోట్లు
ఓవర్సీస్ 98.95 కోట్లు
రెస్ట్ 9.92 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 27 రోజులకు గానూ 589.79 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 27 రోజులకు గానూ రూ. 1092 కోట్లను కొల్లగొట్టింది
ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.
Also Read:Star Directors: ఒక్క ఛాన్స్ తో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే !
Recommended Videos: