CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్

CM Jagan Early Elections: జగన్ సర్కారు సంక్షేమ భారాన్ని మోయలేకుందా? పథకాల అమలుకు ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా? ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిందా? ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సడలిందా? పార్టీలో అంతర్గత విభేదాలు కలవరపెడుతున్నా? ప్రజల విశ్వసాన్ని మరోసారి పొందాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమా?..అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ గెలుపొందింది. […]

Written By: Admin, Updated On : April 21, 2022 4:33 pm
Follow us on

CM Jagan Early Elections: జగన్ సర్కారు సంక్షేమ భారాన్ని మోయలేకుందా? పథకాల అమలుకు ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా? ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిందా? ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సడలిందా? పార్టీలో అంతర్గత విభేదాలు కలవరపెడుతున్నా? ప్రజల విశ్వసాన్ని మరోసారి పొందాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమా?..అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ గెలుపొందింది. జగన్ అంతులేని విజయంతో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. విపక్షాలు దరిదాపులకు రానీయకుండా ఊర్చిపారేశారు.

CM Jagan

అయితే పాలనలో మాత్రం ఆ స్థాయిలో మార్కు చూపించుకోలేకపోయారు. సంక్షేమమే తారక మంత్రంగా భావించేరే తప్ప పాలనను, అభివ్రుద్ధిని గాలికొదిలేశారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం, పోలవరంను పూర్తి చేయకపోవడం, అభివ్రుద్ధి మౌలిక వసతులు కల్పించకపోవడం తదితర కారణాలతో విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు అదుపు చేయలేకపోయారు. అన్నిరంగాల్లో వైఫల్యాలు వెలుగుచూస్తుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలే శరణ్యమని భావిస్తున్నారు. సరిగ్గా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజాభిప్రయానికి వెళ్లనున్నారన్న చర్చ సాగుతోంది. అందులో భాగంగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, పార్టీ ప్రాంతీయ, జిల్లా కార్యవర్గాలను ప్రకటించారు. ఒక విధంగా ఇది ఎన్నికల టీమేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read: Minister Roja: మిస్సయిన మంత్రి రోజా సెల్ ఫోన్. గంటల్లోనే గుర్తింపు.. మంత్రా మజాకా

ఈ రెండేళ్లూ ప్రజల్లో..
ఈ మూడేళ్లూ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారన్న అపవాదు ఉంది. అడపాదడపా పర్యటనలకు మినహాయించి ఎప్పుడూ ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. ఇది కూడా ఆయనకు మైనస్ గా మారింది. ముందస్తు ఎన్నికల ఆలోచన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ స్పీడు పెంచారు. నరసారావుపేట, నంద్యాలలో భారీ బహిరంగ సమావేశాల్లో మాటా్లడారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. గతం కంటే భిన్నంగా మాట్లాడి ఎన్నికల వ్యూహానికి తెరతీశారన్న టాక్ నడుస్తోంది.ఇకపై సభల్లో ప్రసంగించేందుకు జగన్ వీలైనంత తరచుగా జిల్లాల్లో పర్యటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.తన జిల్లా పర్యటనల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.

CM Jagan Early Elections

ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటికే సీఎం పర్యటనల కోసం 2009 మరియు 2015లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసింది, అయితే ఇప్పుడు, జగన్ ప్రభుత్వం అటాచ్డ్ ప్యాంట్రీ మరియు వాష్‌రూమ్ మరియు ఇతర సౌకర్యాలతో కూడిన తాజా వాహనాలను కోరుకుంటోంది. ఇకపై జగన్ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే ప్రయాణించనున్నారు. పర్యటనల సమయంలో, ముఖ్యమంత్రి గ్రామస్తులతో రచ్చ బండ నిర్వహిస్తారు మరియు వాటి పనితీరును పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయాలను కూడా సందర్శిస్తారు. ప్రజలను ఆకర్షించేందుకు గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. జిల్లాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలపై ద్రుష్టి పెడతారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలన్నీ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో లేదా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందు ఉండవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?

Tags