
తెలుగు చిత్ర సీమలో తిరుగులేని దర్శకుడు ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు రాజమౌళి అని. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఆయనదే. ఆయన ఆలోచనల నుంచి జాలువారిన చిత్రాలు తీసుకుంటే అన్ని ఆణిముత్యాలే. ఒకదానిని మంచి మరొకటి హిట్టే. తండ్రి విజయేంద్ర ప్రసాద్ సహకారంతో ఆయన అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఆయనదే.
ఇక ఆయన ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాట గాథతో ఈసారి తనదైన ముద్ర వేసేందుకు రాజమౌళి రెడీ అయిపోతున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ లకు మరోసారి బంపర్ హిట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకే వారికి సూపర్ హిట్లు ఇచ్చిన రాజమౌళి మరోసారి వారికి స్టార్ ఇమేజ్ తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి మాటలు రాస్తున్న సాయిమాధవ్ సైతం ఆర్ఆర్ఆర్ గొప్ప చిత్రమని కితాబిచ్చారు. ఈ సినిమా రేంజిపై ఆయన తన మనోగతం వెల్లడించారు. రాజమౌళి గొప్ప దర్శకుడని కొనియాడారు. ఒక్కో సన్నివేశం ఒక్కో ట్రెండ్ క్రియేట్ చేస్తుందని జోస్యం చెప్పారు. రాజమౌళి పనితీరుపై అందరికి నమ్మకమే ఉంటుంది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ ల పాత్రలు విభిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. వాటిని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పారు. చిత్రం అఖండ విజయం సాధిస్తుందని వివరించారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగా చిత్రం రూపుదిద్దుకుంటుందని అన్నారు. అందరి అంచనాలకు తగినట్లుగా పాత్రల రూపకల్పన ఉంటుందని పేర్కొన్నారు.