RRR Oscar: ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ నుండి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని మేకర్స్, అభిమానులు ఆశించారు. అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పక్కన పెట్టి గుజరాతీ చిత్రం ‘చెల్లో షో'(లాస్ ఫిల్మ్ షో)ని పంపారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం ఒకింత అందరినీ అసహనానికి గురి చేసింది. అయితే ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ నిరాశపడలేదు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అన్వేషించారు.

అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ రోజుల తరబడి ప్రదర్శించిన విషయం తెలిసిందే. యూఎస్ లో $ 14 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఆస్కార్ నిబంధల ప్రకారం రెండు వారాలు అమెరికన్ థియేటర్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించబడిన చిత్రం జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆర్ ఆర్ పలు గ్లోబల్ వేదికలపై ప్రదర్శించబడింది.
Also Read: Godfather vs Ghost: చిరు వర్సెస్ నాగ్… మధ్యలో నేన్నానంటూ డెబ్యూ హీరో… దసరా బరిలో విన్నర్ ఎవరు?
ఆర్ ఆర్ ఆర్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. మేకర్స్ దీన్ని ధృవీకరించారు కూడా. ట్విట్టర్ వేదికగా ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు వెల్లడించారు. గ్లోబల్ వేదికపై మూవీ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఏకంగా ఆర్ ఆర్ ఆర్ 15 కేటగిరీలో పోటీపడనుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బస్టర్ యాక్టర్(ఎన్టీఆర్,రామ్ చరణ్)లతో పాటు పలు విభాగాల్లో పోటీకి నిలవనున్నారు. కాగా ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ అవార్డులు గెలిచే అవకాశం ఉందన్న అంచనా లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోలు చోటు దక్కిన విషయం తెలిసిందే.

బెస్ట్ మోషన్ పిక్చర్
బెస్ట్ డైరెక్టర్ – రాజమౌళి
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవ్ గణ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎం ఎం కీరవాణి
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్.
#RRRForOscars pic.twitter.com/yKzrZ5fPeS
— RRR Movie (@RRRMovie) October 6, 2022