https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ రచ్చ: ఎన్టీఆర్ టోపీ తీస్తారా? రాజమౌళి కాంప్రమైజ్ అవుతారా?

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు టీజర్లు సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. Also Read: మక్కికిమక్కి దించుతానంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నాడు. చెర్రీ పుట్టిన రోజున ‘భీమ్ ఫర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 10:25 AM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు టీజర్లు సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

    Also Read: మక్కికిమక్కి దించుతానంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నాడు. చెర్రీ పుట్టిన రోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజై సన్షేషన్ క్రియేట్ చేసింది. చరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఇందులో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించాడు.

    అదేవిధంగా దసరా కానుకగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజైంది. ఎన్టీఆర్ యాక్షన్ కు రాంచరణ్ వాయిస్ ఓవర్ అందించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ కొన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. టీజర్ చివర్లో కొమురంభీంగా నటిస్తున్న ఎన్టీఆర్ కు ఓ మతానికి చెందిన టోపి పెట్టడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

    నిజాం పాలనకు.. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీంకు అదే మతానికి చెందిన టోపిని పెట్టి చూపించడాన్ని ఆదివాసీ సంఘాలు.. బీజేపీ ఎంపీ సోయం బాపురావు తప్పుబట్టారు. ఈమేరకు కొమురంభీం టోపీ ధరించిన సీన్స్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    ‘ఆర్ఆర్ఆర్’లో కొమురంభీం అజ్ఞాతవాతం చేస్తాడని.. ఆ మొత్తం సీన్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ టోపీ పెట్టుకొనే ఉంటాడని తెలుస్తోంది. అయితే జక్కన్న ఎక్కడా కూడా ఎన్టీఆర్ ను ఓ మతానికి చెందినవాడిలా చూపించడలేదని తెలుస్తోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ పెద్దగా టెన్షన్ పడటం లేదని తెలుస్తోంది.

    Also Read: మహేష్ ‘సర్కారీ వారి పాట’ అప్పుడే మొదలుకానుందా?

    సినిమా చూశాకే ప్రేక్షకులే అర్థం చేసుకుంటారని దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ విన్పిస్తోంది. దీంతో కొమురంభీం టోపి ధరించిన సీన్స్ యథావిధిగా ఉంటాయని ఫిల్మ్ నగర్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.