https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

‘డి.వి.వి దానయ్య’ ఎప్పటినుండో సినిమా రంగంలో నిర్మాతగా కొనసాగుతున్నా.. స్టార్ ప్రొడ్యూసర్ అనే స్టేటస్ మాత్రం ఆయనకు రాలేదు. అయితే ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమాతోనే నేషనల్ రేంజ్ లో నిర్మాతగా దానయ్య పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి ఎప్పుడో వచ్చిన ‘జంబలకిడి పంబ’ అనే సినిమాతో దానయ్య మొదటిసారిగా నిర్మాతగా మారినా.. ఆ తర్వాత మాత్రం భాగస్వామ్యంలోనే ఎక్కువుగా సినిమాలు నిర్మిస్తూ వచ్చి.. చాల సంవత్సరాలు తరువాత డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ ను పెట్టుకుని సోలో […]

Written By:
  • admin
  • , Updated On : October 14, 2020 4:49 pm
    Follow us on


    ‘డి.వి.వి దానయ్య’ ఎప్పటినుండో సినిమా రంగంలో నిర్మాతగా కొనసాగుతున్నా.. స్టార్ ప్రొడ్యూసర్ అనే స్టేటస్ మాత్రం ఆయనకు రాలేదు. అయితే ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమాతోనే నేషనల్ రేంజ్ లో నిర్మాతగా దానయ్య పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి ఎప్పుడో వచ్చిన ‘జంబలకిడి పంబ’ అనే సినిమాతో దానయ్య మొదటిసారిగా నిర్మాతగా మారినా.. ఆ తర్వాత మాత్రం భాగస్వామ్యంలోనే ఎక్కువుగా సినిమాలు నిర్మిస్తూ వచ్చి.. చాల సంవత్సరాలు తరువాత డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ ను పెట్టుకుని సోలో నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ప్రారంభం నుంచీ రకరకాల సమస్యలకు తోడు కరోనా దెబ్బ కూడా గట్టిగానే తగిలింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే.. సుమారు 70 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగింది.

    Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

    అయినా దానయ్య మాత్రం ఎక్కడా భయకుండా ముందుకుపోతున్నాడు. ఒక వ్యక్తి ఒక సినిమాకు నాలుగు వందల కోట్లు పైనే ఖర్చు పెట్టాలి అంటే మాటలా..? డబ్బు కంటే ముందు ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం దానయ్యకు ఉంది. రిస్క్ అయినా వెనక్కి తగ్గలేదు. అందుకే ఆ రిస్క్ కి ఆ కష్టానికి అపుడే ప్రతిఫలం అందటం మొదలైపోయింది. సినీ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైపోయిందట. ఈ సినిమాకు అన్ని భాషల డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ దాదాపు 200 కోట్ల వరకు పలుకుతుందట. సినిమా బడ్జెటే నాలుగు వందల కోట్లు.. అంటే సగం డబ్బులు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారానే వచ్చేస్తున్నాయి.

    Also Read: ప్రభాస్ సినిమాలో ప్రపంచ సుందరి !

    మొత్తానికి ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కు వస్తోన్న ఆఫర్లు చూస్తుంటే.. ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది. నిర్మాత దానయ్యకి ఒక్క సినిమాతోనే వందల కోట్ల లాభాలు వస్తాయని రూమర్స్ కూడా అప్పుడే మొదలైపోయాయి. కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంలా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి రాజమౌళి బలంగానే ట్రై చేస్తున్నారు.