‘బిగ్ బాస్’తో మోనాల్ లింకు.. బట్టబయలు చేసిన కరాటే కల్యాణి?

బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐదువారాలను బిగ్ బాస్-4 షో పూర్తి చేసుకుంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. ఎవరికీవారు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగేందుకు మిగతా వారిని టార్గెట్ చేస్తుండటంతో గేమ్ ఉత్కంఠగా సాగుతోంది. Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే ! ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టులు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : October 14, 2020 5:30 pm
Follow us on

బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐదువారాలను బిగ్ బాస్-4 షో పూర్తి చేసుకుంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. ఎవరికీవారు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగేందుకు మిగతా వారిని టార్గెట్ చేస్తుండటంతో గేమ్ ఉత్కంఠగా సాగుతోంది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టులు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టులు అలరిస్తుండగా.. ఎలిమినేట్ అయినవారు మీడియా ముందు అలరిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ షోకు పుల్ పబ్లిసిటీ పెరిగిపోతుంది. కాగా కిందటి వారం బిగ్ బాస్ నుంచి జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి.. సుజాతలు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అయితే తమకు ఎలిమినేషన్ ప్రక్రియపై పలు సందేహాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఐదోవారం ఎలిమినేషన్ గురించి కరాటే కల్యాణి మాట్లాడుతూ తాను ముందే ఊహించానని చెప్పింది. మోనాల్.. అమ్మ రాజశేఖర్.. సుజాతలలో ఎవరో ఒకరు వెళ్తారని అనుకున్నానని చెప్పింది. వీరిలో మోనాల్ కచ్చితంగా వెళ్లదని.. ఎందుకంటే ఆమె వీకెండ్‌లో కాస్త గ్లామర్ షో చేస్తూ అన్ని కనబడేలా బట్టలు వేసుకుందని చెప్పింది. మేం అలా చేయలేం కాబట్టి మమ్మల్ని బయటకు పంపిచేస్తారు అంటూ హాట్ కామెంట్ చేసింది.

Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

ఇక ‘బిగ్ బాస్’తో వాళ్లకు వాళ్లకు ఏదో లింకులు ఉంటాయి కదా  అంటూ మోనాల్‌పై కల్యాణి  పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మెహబూబ్‌ను కావాలనే సేవ్ చేసినట్టు ఉందని కల్యాణి చెప్పింది. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కు లేని అధికారాన్ని సోహెల్‌కు ఎలా ఇస్తారని ప్రశ్శించింది. ఇక టైటిల్ విన్నర్‌ను కూడా మెహబూబ్‌కే ఇచ్చేయండి అంటూ ఎలిమినేషన్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బిగ్ బాస్-4లో ఎలిమినేషన్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.