దుబ్బాక కాషాయమయమైంది. కమళదళం పోటెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కదిలిరాగా.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కాషాయ దండు కదిలిరావడంతో దుబ్బాక అంతా అదే రంగు పులుముకుంది. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులతో రఘునందన్ రావు నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా సాగింది.
Also Read: ఎంత పని చేసింది కరోనా.. కవితకు గెలిచిన సంబురం లేకపాయె!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాలంతా బయటకు రావడం లేదు.నేతలు, కార్యకర్తలు కూడా గడప దాటడం లేదు.పైగా ఇప్పుడు తెలంగాణ జోరున వర్షాలు.. కానీ ఇవేవీ దుబ్బాకలో కమలనాథులకు అడ్డు రాలేదు. భారీగా తరలివచ్చిన బీజేపీ అభిమానులతో దుబ్బాక కిక్కిరిసింది.
దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా చాలా మంది బీజేపీ నేతలు ఆయన వెంట కదిలివచ్చారు. దుబ్బాకకు పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
భారీగా పోటెత్తిన జనాలు, కార్యకర్తలు, బీజేపీ అభిమానులను చూస్తే ఖచ్చితంగా గెలుపు రఘునందర్ రావుదేనని.. బీజేపీ దుబ్బాకలో గెలుస్తుందన్న ధీమా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో నామినేషన్ ప్రక్రియలోనే బీజేపీకి కొండంత బలం వచ్చినట్టైంది. ఇదే ఊపులో దుబ్బాకలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావులు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: అందమైన అమ్మాయిలతో డేటింగ్ అంటూ దోచేస్తారు..
కాగా దుబ్బాక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా… 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కించి విజేతను ప్రకటిస్తారు.