Golden Globe Awards 2022- RRR: ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ నామినేషన్స్ కి ఎంట్రీ దక్కలేదు. ఇది కేవలం ఓ కమర్షియల్ మాస్ ఫిలిం గా ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చూశారు. కానీ ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ కి దక్కుతున్న గౌరవం చూశాక, వారి అభిప్రాయం తప్పని తేలిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ సినిమా అవార్డ్స్ ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి అవార్డ్స్, గౌరవం దక్కుతున్నాయి.

కాగా ఆర్ ఆర్ ఆర్ మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచింది. గోల్డెన్డ్ గ్లోబ్ అవార్డ్స్ 2023 గాను ఆర్ ఆర్ ఆర్ రెండు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి నామినేషన్స్ దక్కాయి. నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్… ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్'(జర్మనీ), అర్జెంటీనా 1985(అర్జెంటీనా), క్లోజ్(ఫ్రాన్స్, బెల్జియం, నెథర్లాండ్స్), డెసిషన్ టు లీవ్(సౌత్ కొరియా) చిత్రాలతో పోటీపడనుంది. వీటిలో ఒకటి ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.
అలాగే ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఏ ఒక్క విభాగంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కినా… దాన్ని అరుదైన గౌరవంగా భావించవచ్చు. కాగా మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రెహమాన్ 2009లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఈ అవార్డు ఆయన్ని వరించింది. ఈ చిత్రానికి ఆయన ఆస్కార్ కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.

కాగా ఆస్కార్ నామినేషన్స్ కొరకు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని 15 విభాగాల్లో అప్లై చేశారు. అత్యంత అరుదైన గౌరవంగా భావించే ఆస్కార్ ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కుతుందని ఇండియన్ ఫిల్మ్ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. దర్శకుడు పీరియాడిక్ రివల్యూషనరీ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించాడు. రామ్, భీమ్ అనే కల్పిత పాత్రల ఆధారంగా కథ సాగుతుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.