Unstoppable With Nbk – Prabhas: ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక టాక్ షోలో పాల్గొంటున్నారు. బహు సిగ్గరి అయిన ప్రభాస్ ఇలాంటి షోలకు హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అలాగే సోషల్ మీడియాను వాడరు. దీంతో ఫ్యాన్స్ కి ఆయన దర్శనం అరుదుగా జరుగుతుంది. ఈ క్రమంలో బాలయ్య హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ గెస్ట్ గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాస్-బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు, ప్రోమోలు బయటకు వచ్చాయి. కాగా ఈ షో కోసం ప్రభాస్ ధరించిన షర్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది.

మరి స్టార్స్ గురించి ప్రతి విషయం ఆసక్తిరేపుతుంది కాబట్టి. దాని ధర ఎంత? ఏ బ్రాండ్? అనే సమాచారం రాబట్టారు. ఎల్లో బ్లూ మల్టీకలర్ కాంబినేషన్ తో ఉన్న ఆ షర్ట్ పోలో రాల్ఫ్ లారెన్ బ్రాండ్ గా తెలుస్తుంది. ఆన్లైన్ లో ఈ షర్ట్ ధర 115 పౌండ్స్ గా చూపిస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,618. సినిమాకు వంద కోట్లు తీసుకునే ప్రభాస్ కి పదకొండు వేలంటే చాలా చిన్న అమౌంట్. అదే ఒక మధ్య తరగతి వ్యక్తి ఏడాదికి సరిపడా బట్టల షాపింగ్ చేయవచ్చు.
ఆ విషయం అటు ఉంచితే బోల్డ్ అండ్ కాంట్రవర్సీ ప్రశ్నలకు అన్ స్టాపబుల్ కేరాఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలో ప్రభాస్ ని బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. 43 ఏళ్ల ప్రభాస్ వివాహం చేసుకోలేదు. ఈ విషయం ఖచ్చితంగా చర్చకు వస్తుంది. బాలయ్య ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడగడం ఖాయం. అలాగే హీరోయిన్ అనుష్కతో ఎఫైర్ రూమర్స్ గురించి అడిగే ఆస్కారం కలదు. ప్రభాస్ తో పాటు ఈ టాక్ షోలో మిత్రుడు గోపీచంద్ జాయిన్ కానున్నారు.

ప్రభాస్-గోపీచంద్ లతో బాలయ్య సరదా సంభాషణలు ఎలా సాగుతాయో చూడాలి. మరోవైపు ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే షూట్స్ లో బిజీగా ఉన్నారు. 2023లో సలార్ విడుదల కానుంది. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి స్టార్ క్యాస్ట్ సలార్ మూవీలో నటిస్తున్నారు. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దర్శకుడు మారుతితో కమిటైన చిత్ర షూట్లో ప్రభాస్ త్వరలో జాయిన్ అవుతాడంటూ వార్తలు వస్తున్నాయి.