RRR: ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ చిత్రం కొల్లగొట్టింది. అలాగే ‘బాహుబలి 2’ కూడా దాదాపు 1800 కోట్లు పైనే వసూళ్లు చేసింది. అసలు బాహుబలి సిరీస్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధిస్తోందని రాజమౌళి కూడా ఊహించలేదు. కానీ, భారతీయ చలనచిత్ర బాక్సాఫీస్ లెక్కల రూపాన్ని మార్చేసిన సినిమాగా బాహుబలి సినీ చరిత్రలో శాశ్వతంగా వార్తల్లోకెక్కింది.

అంతటి అఖండ విజయం తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అందుకే ఈ సినిమా బాహుబలి’ని మించి అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాహుబలిని మించి ఆడుతుందని అందరూ నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ, మధ్యలో కరోనా వచ్చింది. కరోనా కారణంగా సినిమా మేకింగ్ లో కూడా కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సి వచ్చింది.
ఆ షరతుల మధ్యన ఈ చిత్రాన్ని రాజమౌళి పూర్తి చేశాడు. దీనికి తోడు ఏపీలో టికెట్ రేట్లు ఒకటి. ఇప్పుడున్న రేట్లతో సినిమాని రిలీజ్ చేస్తే.. సగం కలెక్షన్స్ పడిపోయినట్లే. ఏది ఏమైనా ప్రస్తుతం అంతా గందరగోళంలో ఉంది సినిమా పరిశ్రమ. ముఖ్యంగా భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్ చేస్థాయో సినిమా ట్రేడ్ పండితులు కూడా అంచనా కట్టలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్” బాక్సాఫీస్ విజయాన్ని బట్టే.. తెలుగు సినిమాల మార్కెట్ కు లెక్కలు కట్టాల్సి ఉంటుంది. కాకపోతే, ఆర్ఆర్ఆర్ సినిమాను మిగతా సినిమాలతో పోల్చలేం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు హద్దులు లేవు. అది ఒక అద్భుతం అన్నట్టు ప్రజలు ఆ సినిమా కోసం ఎగబడతారు. అలాగే మిగితా స్టార్ హీరోల సినిమాల కోసం అంతగా ఎగబడతారా అంటే డౌటే.
Also Read: Renu Desai: పుకార్లు పై ‘రేణు దేశాయ్’ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !
అందుకే, ఆర్ఆర్ఆర్ కలెక్ట్ చేసే కలెక్షన్స్ ఇక తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని చెబుతుంది. ఆ స్థాయిని బట్టి.. మిగిలిన సినిమాల ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తాయో ఓ అంచనా వేయొచ్చు. మొత్తమ్మీద ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీస్ కి దిక్సూచి. ఇటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కూడా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ కోసమే ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: RRRvsPrabhas: ‘ఆర్ఆర్ఆర్’కు అక్కడ పెద్ద సమస్యగా మారిన ‘రాధేశ్యామ్’!