Nani: నేచురల్ స్టార్ నానీ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్ సింగరాయ్. అయితే, ఈ సినిమాకు విడుదల పరంగా అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. డిసెంబరులో విడుదలకు సిద్ధమైన శ్యామ్‌సింగరాయ్.. అదే నెలలో మరో నాలుగు సినిమాలు పోటీగా నిలిచేందుకు వస్తున్నాయి. ఇప్పుడు మరో భారీ సినిమా కూడా ఇదే నెలలో విడుదలవడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే వరుణ్‌తేజ్ నటించిన గని సినిమాను డిసెంబరు 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కల్యాణ్‌రామ్ బింబిసార మేకర్స్ కూడా ఇదే రోజు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నానికి బాక్సాఫీసు కష్టాలు తప్పేలా లేపని తెలుస్తోంది.
మరోవైపు, పుష్ప సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. డిసెంబరు 24కి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తే.. గని సినిమా విడుదల తేదీని 2022కి వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, ప్రస్తుతం పరిణామాలన్నీ తిరిగి తిరిగి నానిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం ప్రమోషన్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు. ఇన్ని సినిమాలు మధ్య నాని నిలబడతారా? లేక వెనక్కి తగ్గుతాడా అనేది ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా శ్యామ్ సింగరాయ్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ తెలుగులో నాని విడుదల చేయగా, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో నజ్రియా, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల మీదుగా టీజర్ విడుదల అయ్యింది.
