https://oktelugu.com/

RRR 10 Days Collections: షాకింగ్.. ఇది తెలుగు వాడి సింహ గర్జన !

RRR 10 Days Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్‌ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ […]

Written By: , Updated On : April 4, 2022 / 01:17 PM IST
Follow us on

RRR 10 Days Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్‌ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు.

RRR 10 Days Collections

RRR 10 Days Collections

ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, 10 రోజులకు గానూ మొత్తం ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

నైజాం 97.00 కోట్లు

సీడెడ్ 44.50 కోట్లు

ఉత్తరాంధ్ర 28.12 కోట్లు

ఈస్ట్ 13.85 కోట్లు

వెస్ట్ 11.47 కోట్లు

గుంటూరు 16.34 కోట్లు

కృష్ణా 12.95 కోట్లు

నెల్లూరు 07.96 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 10 రోజులకు గానూ 232.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

తమిళనాడు 33.58 కోట్లు

కేరళ 09.25 కోట్లు

కర్ణాటక 36.95 కోట్లు

హిందీ 91.10 కోట్లు

ఓవర్సీస్ 84.20 కోట్లు

రెస్ట్ 06.93 కోట్లు

Also Read: RRR 9th Day Collections: రాజమౌళి నీరాజనాలతో బాక్సాఫీస్ చిన్నబోయింది

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజులకు గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 494.20 కోట్లు కలెక్ట్ చేసింది.

ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. అందుకే ఈ కలెక్షన్స్ చూసి.. ఇది తెలుగు వాడి సింహగర్జన అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం అయినా రాజమౌళి శుభాభినందనలు.

Also Read: Pawan Future CM RRR Writer Crazy Comments: పవన్ కాబోయే సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ రైటర్ క్రేజీ కామెంట్స్

Tags