Priyanka Jawalkar: తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కి ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా.. ప్రేమ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకుంటుంది. తన లవ్ ముచ్చట్లతో ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

అయితే, ఉన్నట్టు ఉండి.. నెటిజన్లు ప్రియాంక జవాల్కర్ పై పడటానికి మెయిన్ కారణం.. ఆమె ఓవర్ యాక్టింగే. ప్రియాంక జవాల్కర్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫొటోకు అయ్యర్ ‘క్యూట్’ అంటూ రిప్లై ఇచ్చి తెగేది సిగ్గుపడిపోయాడు. మనోడు చేసిన మెసేజ్ చూసిన ఈ బబ్లీ బ్యూటీ ‘హు యూ’ అంటూ అమాయకంగా ఏమి తెలియని అమ్మాయిలా ప్రశ్నించింది.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ మోజులో స్టార్ డైరెక్టర్.. చివరకు చిరంజీవి విషయంలో కూడా
కట్ చేస్తే.. అమ్మడు ఓవర్ యాక్టింగ్ కి ఓ నెటిజన్ సీరియస్ అయిపోయాడు. ‘మీ ఓవరాక్షన్ ఆపండి. మీరిద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని మాకు తెలుసు. మీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కూడా తెలుసు.. మేడమ్ ప్రియాంక జవాల్కర్ యాక్టింగ్ సినిమాల్లో చేయి.. బయట కాదు’ అని కొందరు, నీ ఓవరాక్షన్ ఆపు.. నీ వ్యవహారం మాకు తెలుసు” అంటూ మరికొందరు నెటిజన్లు మొత్తానికి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఏది ఏమైనా ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రియాంక జవాల్కర్. అదృష్టం కలిసి వచ్చి.. మధ్యలో ఆమె చేసిన రెండు సినిమాలు ‘తిమ్మరుసు’, ‘SR కల్యాణమండపం’ కూడా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.
అదేమిటో రెండు సినిమాలకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా.. ప్రేక్షకుల వైపు నుంచి మంచి ఆదరణ లభించినా.. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ప్రియాంక జవాల్కర్ ఏ రకంగానూ ప్లస్ కాలేదు. పైగా ప్లస్ కాకపోగా పెద్ద మైనస్ అయింది. మొత్తానికి ఈ భామ ప్రస్తుతం అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
Also Read:Naga Shourya- NTR: స్టార్ హీరోతో యంగ్ హీరోకు బంధుత్వం ఉందా.. భలే ఇంట్రెస్టింగ్..
[…] […]
[…] […]