#RRR – 2 : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR పాన్ వరల్డ్ రేంజ్ లో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మాటల్లో చెప్పలేము..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీ విడుదల తర్వాత విదేశీయులు ఎగబడిమరీ చూసారు..నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ సినిమాలు కాకుండా వంద మిలియన్ కి పైగా వ్యూస్ ని రప్పించుకున్న ఏకైక ఇండియన్ చిత్రం గా #RRR సరికొత్త చరిత్ర సృష్టించింది.

పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు రావడం తో,ఈ సినిమాకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ కూడా వరుసగా క్యూ కట్టేస్తున్నాయి..ఇప్పటికే ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి కి మరియు సంగీత దర్శకుడిగా కీరవాణి పలు అవార్డ్స్ దక్కాయి..ఇప్పుడు లేటెస్ట్ గా ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి షార్ట్ లిస్ట్ అవ్వడం మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ విషయం.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన ఉంది.. దాని మీద వర్క్ చేస్తున్నాం అంటూ రాజమౌళి అనేక ఇంటర్వ్యూస్ లో తెలిపాడు..ఒక అద్భుతమైన లైన్ దొరికిందని..కచ్చితంగా ఈ సీక్వెల్ కూడా బాహుబలి పార్ట్ 2 రేంజ్ లో క్లిక్ అవుతుందనే నమ్మకం ఉందంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు..తన ప్రతి సినిమాకి ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించే రాజమౌళి #RRR సీక్వెల్ కూడా ఎప్పటి నుండి మొదలు పెట్టాలో ఇప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఉంచాడట.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కోసం రాజమౌళి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకోదట..2025 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసి అదే ఏడాది లో #RRR పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్త.