Allu Sneha Reddy : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ వైఫ్స్ లో స్నేహారెడ్డి ఒకరు. బన్నీ భార్యగా కాకుండా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్, ఇమేజ్ ఆమె తెచ్చుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆమెను ఏకంగా 8 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఇది ఓ స్టార్ హీరోయిన్ కి ఉండే ఫాలోవర్స్ సంఖ్యతో సమానం. తన అభిమానులతో ఆమె తరచుగా టచ్ లో ఉంటారు. తన వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ, పిల్లలు, భవిష్యత్ ప్రణాళికలు వారితో షేర్ చేస్తారు. తాజాగా స్నేహారెడ్డి మరోసారి అభిమానులతో సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డిని ఒక నెటిజెన్ ఆసక్తికర ప్రశ్న అడిగారు.

కొత్త ఏడాది వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఓ టార్గెట్ పెట్టుకుంటారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలని కోరుకుంటారు. ఇక స్నేహారెడ్డి 2023కి గాను నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలని ఒక ఫ్యాన్ భావించారు. ఇదే ప్రశ్న ఆమెను అడగడంతో సమాధానం చెప్పారు. నేను వచ్చే ఏడాది మరింత ఎక్కువ సమయం అయాన్ తో పాటు వంట చేస్తూ కిచెన్ తో గడపాలి అనుకుంటాను అని, కొడుకుతో దిగిన ఫోటో షేర్ చేసింది. అలాగే తన అభిమానికి న్యూ ఇయర్ బెస్ట్ విషెస్ తెలియజేసింది.
ఇక తన ఫేవరెట్ ఫుడ్ ఇండియన్ బిర్యానీ అని స్నేహారెడ్డి చెప్పుకొచ్చారు. కొడుకు అయాన్ తో పాటు వంట చేయడం స్నేహారెడ్డికి మజా ఇచ్చే విషయమని ఆమె సమాధానంతో తెలిసింది. ఇక అందానికి చిరునామాలా ఉండే స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. డిజైనర్ వేర్స్ ధరించి మెస్మరైజ్ లుక్స్ లో అలరిస్తారు. స్నేహారెడ్డి అంత అందగత్తె కాబట్టే పట్టుబట్టి అల్లు అర్జున్ ఆమెను వివాహం చేసుకున్నాడు.
స్నేహారెడ్డి-అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి స్నేహారెడ్డి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. స్నేహారెడ్డి ఫాదర్ మొదట ఈ వివాహానికి ఒప్పుకోలేదట. అల్లు అరవింద్ స్వయంగా సంబంధం మాట్లాడటానికి వెళ్లినా నో అన్నారట. అయితే స్నేహారెడ్డి పెళ్లి చేసుకుంటే బన్నీనే చేసుకుంటానని పట్టుబట్టడంతో… ఎస్ చెప్పారట. 2011లో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి అయాన్, అర్హ అనే అబ్బాయి, అమ్మాయి పుట్టారు.