Ram Charan #RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..చాలా నెలల నుండి షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి కనీసం టైటిల్ ని కూడా మూవీ యూనిట్ ప్రకటించకపోవడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు..ట్విట్టర్ లో అయితే చాలా సార్లు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పై నెగటివ్ హాష్ ట్యాగ్ తో ట్రెండ్స్ కూడా చేసారు.

దిల్ రాజు ఈ ట్రెండ్ పై స్పందిస్తూ ‘నేను కూడా మీలాగానే ఎదురు చూస్తున్నాను..కానీ నా చేతుల్లో ఏమి లేదు..శంకర్ సార్ మాత్రమే ఖరారు చెయ్యాలి..కాస్త ఓపిక పట్టండి అప్డేట్ ఇస్తాము’ అని దిల్ రాజు చెప్పాడు..ఈ ఆయన చెప్పి దాదాపుగా ఆరు నెలలు కావొస్తుంది..సోషల్ మీడియా లో లీక్ అయ్యే ఫొటోలతోనే సర్దిపెట్టుకోవాల్సి వస్తుంది తప్ప మూవీ టీం నుండి అధికారికంగా ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు.
అభిమానులు అప్డేట్ కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని ట్యాగ్ చేసి రోజూ తిడుతూనే ఉన్నారు..కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు..అయితే ఇక నుండి రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళను తిట్టాల్సిన అవసరం లేదు..ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన న్యూ ఇయర్ రోజు స్వయంగా రామ్ చరణ్ తెలియచేస్తాడట..అలా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ నుండే తీపి కబురుతో ఆరంభించబోతున్నాడు రామ్ చరణ్.
ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా..అంజలి పెద్ద రామ్ చరణ్ కి భార్య పాత్రలో నటిస్తుంది..ఇప్పటికే రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు..శ్రీకాంత్ , సునీల్ మరియు ఎస్ జె సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.