https://oktelugu.com/

Roshan: హీరోగా యాంకర్ సుమ కొడుకు… ఫస్ట్ లుక్ చూశారా!

Roshan: స్టార్ యాంకర్ సుమ వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే సమాచారం ఉంది. రోషన్ ఫస్ట్ మూవీ కోసం సుమ కొన్నాళ్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది రోషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకుడు. ఆయన తెరకెక్కించిన క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా క్షణం ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన […]

Written By:
  • Shiva
  • , Updated On : March 16, 2023 / 09:47 AM IST
    Follow us on

    Roshan: స్టార్ యాంకర్ సుమ వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే సమాచారం ఉంది. రోషన్ ఫస్ట్ మూవీ కోసం సుమ కొన్నాళ్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది రోషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకుడు. ఆయన తెరకెక్కించిన క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా క్షణం ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన క్షణం మూవీలో అడివి శేష్ హీరోగా నటించారు. క్షణం మూవీతో రవికాంత్ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు.

    ఇక రోషన్ తో ఆయన రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మార్చి 15న రోషన్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో రోషన్ ఆకట్టుకున్నారు. అతడు డిస్క్ జాకీ(డీజే)గా కనిపించే ఆస్కారం కలదు. మొత్తంగా రోషన్ ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. పి. విమల నిర్మాతగా ఉన్నారు. ఇక యాంకర్ గా బుల్లితెరను శాసించిన సుమ కుమారుడు ఏ స్థాయిలో హీరోగా విజయం సాధిస్తాడో చూడాలి.

    సుమ నటుడు రాజీవ్ కనకాల సతీమణి అన్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు రోషన్, అమ్మాయి పేరు మనస్విని. సుమ, రాజీవ్ లకు పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొడుకును హీరోగా నిలబెట్టాలని ఆశపడుతున్నారు. రాజీవ్ సీనియర్ నటుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించారు.

    కాగా సుమ ప్రస్థానం మొదలైంది నటిగానే. ఆమె ఓ మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం చాలా మందికి తెలియదు. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర హీరో ఎవరంటే… స్టార్ రైటర్ గా సెటిల్ అయిన వక్కంతం వంశీ. నటిగా ఆమెకు సక్సెస్ రాలేదు. దీంతో యాంకర్ గా మారి స్టార్ అయ్యారు. ఇక 1999లో రాజీవ్ కనకాలను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ మధ్య ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు రావడం కొసమెరుపు. విడాకుల వార్తలకు సుమ, రాజీవ్ తమదైన శైలిలో చెక్ పెట్టారు.