https://oktelugu.com/

Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో ఘాటు రొమాన్స్..పట్టించుకోని హోస్ట్..రెచ్చిపోతున్న హౌస్ మేట్స్..వైరల్ అవుతున్న వీడియో!

యష్మీ , గౌతమ్, నిఖిల్ మధ్య ఒక ట్రాక్ నడుస్తుండగా, విష్ణు, పృథ్వీ, నయనీ పావని మధ్య మరో ట్రాక్ నడుస్తుంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, క్లీన్ లవ్ స్టోరీస్ గా ఉన్న వీటినే మన ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 01:26 PM IST

    Bigg Boss

    Follow us on

    Bigg Boss: కుటుంబ సమేతంగా చూసే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి బిగ్ బాస్. మన తెలుగునాట ఈ రియాలిటీ షో కి ఎంత ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 7 ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని, ప్రస్తుతం 8 వ సీజన్ ని జరుపుకుంటుంది. గత రెండు సీజన్స్ లో మిస్ అయిన లవ్ ట్రాక్స్, ఈ సీజన్ లో ఎక్కువైపోయాయి. అది కూడా 2 సైడ్స్ లవ్ కాదు, ట్రైయాంగులర్ లవ్ స్టోరీస్. యష్మీ , గౌతమ్, నిఖిల్ మధ్య ఒక ట్రాక్ నడుస్తుండగా, విష్ణు, పృథ్వీ, నయనీ పావని మధ్య మరో ట్రాక్ నడుస్తుంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, క్లీన్ లవ్ స్టోరీస్ గా ఉన్న వీటినే మన ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోతున్నారు. ఇక హిందీ బిగ్ బాస్ లో అయితే కంటెస్టెంట్స్ మధ్య ఏకంగా శృంగార సన్నివేశాలే జరిగిపోతున్నాయి.

    ఇది ఒక బిగ్గెస్ట్ రియాలిటీ, వంద కెమెరాలు మనల్ని చూస్తుంటాయి, కోట్లాది మంది ప్రేక్షకులు వాటిని వీక్షిస్తారు అనే స్పృహ కూడా వీరిలో లేదు. మన తెలుగు లో భార్య భర్తల జంటలు హౌస్ లోకి వచ్చినప్పుడు ఎంత పద్దతి గా ఉండేవారో మీరంతా చూసే ఉంటారు. కానీ అక్కడ ముక్కు మొహం తెలియని బయట వారు, హౌస్ లో పరిచయాలను పెంచుకొని, ఘాటు రొమాన్స్ చేసుకునే స్థాయికి వచ్చేసారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోండి. లేటెస్ట్ గా సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో లో ఒక అమ్మాయి అబ్బాయి దుప్పటి కప్పుకొని ఊగిపోతున్నారు. లోపల ఏమి జరిగి ఉండుంటుందో మీరు అర్థం చేసుకోగలరు. వీళ్లకు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తారు అనే భయం కూడా లేదా..?, ఇంత సిగ్గు వదిలేశారేంటి?, ఈ షో కి హోస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.

    ఆయన ఇలాంటి పనులను ఎలా స్వాగతిస్తున్నాడు?, బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా చలామణి అయ్యే సల్మాన్ ఖాన్, కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిల్చిన ఆయన ఇలాంటి సంఘటనలను నిలదీయకుండా వదిలేస్తే సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. 17 సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న హిందీ బిగ్ బాస్, ఇప్పుడు 18 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇలాంటి సంఘటనలు హిందీ బిగ్త్ బాస్ లో సర్వసాధారణం. గతంలో ఇంత కంటే ఘాటైన రొమాన్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హన్మంత్ అనే అమ్మాయి, షణ్ముఖ్ జస్వంత్ కి మాటికొస్తే హగ్గులు, కిస్సులు ఇస్తుంటే చూసేందుకు ఆడియన్స్ కి చాలా చిరాకుగా అనిపించింది కదూ..!, అంతకు పదింతలు ఎక్కువగా హిందీ బిగ్ బాస్ లో జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇలాంటివి చూడాలో అని ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు.