https://oktelugu.com/

Amaran Collection: రజినీకాంత్ ‘వెట్టియాన్’ ని దాటేసిన శివ కార్తికేయన్ ‘అమరన్’..మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయంటే!

శివ కార్తికేయ గత రెండు చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఇంత లేవు, అలాంటిది ఇప్పుడు ఏకంగా మొదటి రోజే 40 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు అంటే ఆయన స్థాయి ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 01:29 PM IST

    Amaran Collection

    Follow us on

    Amaran Collection: తమిళనాడు లో కొత్త సూపర్ స్టార్ గా శివ కార్తికేయన్ అవతరించాడా..?, ఒకపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ కి వయస్సు అయిపోయింది, ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరోపక్క నేటి తరం సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, ఇక తల అజిత్ సంగతి సరేసరి..రెండేళ్లకు ఒక సినిమా తీస్తాడు, ఆ సినిమా కూడా బీలో యావరేజ్ రేంజ్ ఉంటున్నాయి. ఈ గ్యాప్ ని శివ కార్తికేయన్ సరిగ్గా ఉపయోగించుకొని తమిళనాట కొత్త సూపర్ స్టార్ గా మారిపోయాడని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అందుకు ఉదాహరణ నిన్న విడుదలైన ‘అమరన్’ చిత్రం ఓపెనింగ్స్. ఈ సినిమాకి తమిళనాడు లో ఈ ఏడాది భారీ ఓపెనింగ్స్ సాధించుకున్న విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, రజినీకాంత్ ‘వెట్టియాన్’ తో సమానంగా గ్రాస్ వసూళ్లను మొదటి రోజు రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ముఖ్యంగా బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో అయితే ఈ చిత్రానికి గంటకు 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. కేవలం ‘దేవర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ ట్రెండ్ నడిచింది. రజినీకాంత్ ‘వెట్టియాన్’ కి కూడా ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోలేదు. దీనిని బట్టీ చూస్తే శివ కార్తికేయన్ అధికారికంగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రమే కాదు, తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా భారీగా వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు వెర్షన్ నుండి 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే షేర్ వసూళ్లు దాదాపుగా 3 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. పాజిటివ్ టాక్ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందడం వల్ల ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని తెలుగు వెర్షన్ లో అందుకునే అవకాశాలు ఉన్నాయట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రెండు భాషలకు కలిపి మొదటి రోజు 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాయని అంటున్నారు.

    శివ కార్తికేయ గత రెండు చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఇంత లేవు, అలాంటిది ఇప్పుడు ఏకంగా మొదటి రోజే 40 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు అంటే ఆయన స్థాయి ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్న ఈ సినిమాకి ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిలు రాబట్టే అవకాశం ఉందని, శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు కూడా ఈ సినిమాకి వసూళ్లు చాలో సాలిడ్ గా ఉన్నాయి, ఈరోజు కూడా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.