Bigg Boss 6 Telugu: చూస్తుంటే సిపిఐ నారాయణ చెప్పింది నిజమే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ ని ఆయన బ్రోతల్ హౌస్ తో పోల్చారు. ఆ కామెంట్స్ ని బలపరిచేలా కంటెస్టెంట్స్ ప్రవర్తన ఉంది. ఇనయా సుల్తానా, సూర్య మధ్య రొమాన్స్ హద్దులు దాటేస్తుంది. ఓకే బెడ్ పై పడుకోవడం, ఒకే ప్లేటులో తినడం చేస్తున్న ఈ జంట ఇంకో అడుగు ముందుకు వెళ్లారు. ఆర్జే సూర్య వస్తూనే హౌస్లో రోమాన్స్ మొదలుపెట్టాడు. గతంలో పరిచయం ఉన్న ఆరోహిరావును లైన్లో పెట్టాడు. ఆరోహిరావు ఎలిమినేట్ కానంత వరకూ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. హగ్గులు,ముద్దులు కానిచ్చాడు. మూడవ వారం ఆరోహిరావు ఎలిమినేటై వెళ్లిపోయారు.

వెంటనే ఇనయా సుల్తానాను బుట్టలో వేసుకున్నాడు. ఆమెకు కూడా పిచ్చ ఇంట్రెస్ట్ గా ఉండడంతో త్వరగా ఎఫైర్ సెట్ అయ్యింది. ఇనయా ఓపెన్ గా తనకు సూర్య అంటే ఇష్టమని చెప్పేసింది. హౌస్ మేట్స్ కి క్లియర్ గా అర్థం కావడంతో దాపరికం లేకుండా ప్రేమించుకుంటున్నారు. ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. కలిసి తింటున్నారు. వీలు దొరికినప్పుడల్లా రొమాన్స్ చేసుకుంటున్నారు.
అది చాలదన్నట్లు ఒకరి ఎంగిలి మరొకరు తింటున్నారు. ఇనయా తాను చప్పరించిన లాలీపాప్ సూర్యకు ఇచ్చింది. సిగ్గుపడకుండా ఎంగిలి అని ఫీల్ కాకుండా సూర్య దాన్ని ప్రసాదం నాకినట్లు నాకేశాడు. ఏదో కొరుక్కు తినే ఫుడ్ ఐటమ్స్ తిన్నా ఒక అర్థం ఉంది 360 కోణంలో నోట్లో పెట్టుకొని నాకే లాలీపాప్ ని ఆమె తిన్నాక ఆర్జే సూర్య తినడం జుగుప్స కలిగించింది. దీంతో ఆడియన్స్ ఇంత తెగించారు ఏంట్రా బాబు అంటూ… ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ తో కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులను చూడడం, మాట్లాడడం చేశారు. ఒకింత హోమ్ సిక్ నుండి బయటపెడేలా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. ఇక రెండు రోజుల్లో ఆదివారం రానుంది. దీంతో ఈ వారం హౌస్ వీడేది ఎవరనే ఆత్రుత మొదలైంది.ఈ వారానికి గానూ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, కీర్తి, రాజశేఖర్, మెరీనా, శ్రీసత్య, సుదీప, శ్రీహాన్ నామినేట్ కావడం జరిగింది. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. గత వారం చలాకీ చంటి ఎలిమినేటైన విషయం తెలిసిందే.