https://oktelugu.com/

Surya: ‘రోలెక్స్’ చిత్రం ‘విక్రమ్’ కి సంబంధం లేదా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలన అప్డేట్ ఇచ్చిన హీరో సూర్య!

ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'కూలీ' అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత ఆయన కార్తీ తో 'ఖైదీ 2 ' చేయబోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 04:52 PM IST

    Surya(2)

    Follow us on

    Surya: ఇటీవల కాలం లో యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన క్యారక్టర్ ‘రోలెక్స్’. కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విక్రమ్’ చిత్రం క్లైమాక్స్ లో చివరి 5 నిమిషాలు మాత్రమే ఈ పాత్ర కనిపిస్తుంది. హీరో సూర్య ని అంత పవర్ ఫుల్ గా చూసిన అభిమానులు పూనకాలొచ్చి ఊగిపోయారు. ఈ 5 నిమిషాల క్యారక్టర్ విక్రమ్ చిత్రాన్ని బాక్స్ ఆఫీస్ పరంగా మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ క్యారక్టర్ కేవలం ఈ ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమా?, ప్రత్యేకంగా ఒక సినిమా ఉంటుందా లేదా అనే సందేహం అప్పట్లో అభిమానుల్లో ఉండేది. దీనికి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ క్లారిటీ ఇస్తూ కచ్చితంగా ఈ క్యారక్టర్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సినిమా ఉంటుందని, ప్రస్తుతం కమిట్ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.

    ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత ఆయన కార్తీ తో ‘ఖైదీ 2 ‘ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ‘రోలెక్స్’ చిత్రం ఉంటుందని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువ’ నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి నుండే ప్రమోషనల్ కార్యక్రమాల్లో డైరెక్టర్ శివతో కలిసి పాల్గొంటున్నాడు సూర్య. ఈ ప్రొమోషన్స్ లో ఆయన రోలెక్స్ చిత్రం గురించి మాట్లాడుతూ ‘2022 వ సంవత్సరంలో విడుదలైన విక్రమ్ చిత్రం తో డైరెక్టర్ లోకేష్ 1986వ సంవత్సరం లో విడుదలైన విక్రమ్ చిత్రానికి ఎలా అయితే లింక్ పెట్టాడో, రోలెక్స్ చిత్రాన్ని కూడా నా పాత సినిమాలలో ఒకదానికి లింక్ పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.

    దీంతో సోషల్ మీడియా లోని అభిమానులు ఏ చిత్రానికి లింక్ పెట్టాడు?, ‘రోలెక్స్’ విక్రమ్ చిత్రానికి సీక్వెల్ కాదా?, సూర్య పాత సినిమాకి సీక్వెల్ గా రాబోతోందా అని ఆరాలు తీస్తున్నారు. గతం లో సూర్య వీడోక్కడే అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కూడా అక్రమ నేరాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కింది. ఇందులో సూర్య దొంగతనాలు, స్మగ్లింగ్ వంటివి చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలోని క్యారక్టర్ ఇప్పుడు రోలెక్స్ గా రూపాంతరం చెందిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఆ చిత్రం లో హీరో క్యారక్టర్ డ్రగ్స్ కి విరుద్ధం గా ఉంటుంది. మరి అలాంటి క్యారక్టర్ ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారంలోకి ఎలా అడుగుపెట్టింది అనే అంశంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా?, లేకపోతే వేరేలా ఉండబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సూర్య రోలెక్స్ పాత్ర గురించి చెప్పిన ఈ ట్విస్ట్ కేవలం ఆయన అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అమితాసక్తిని రేపింది.