https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, దీపికా పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన అట్టర్ ఫ్లాప్ సినిమా అదేనా..?

దీపికా పదుకొనే కి డేట్స్ సమస్య రావడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత త్రిష ని తీసుకున్నారు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ, అదే సినిమాని ఇప్పుడు విడుదల చేస్తే మాత్రం కళ్ళు చెదిరే వసూళ్లు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 04:57 PM IST

    Pawan Kalyan(25)

    Follow us on

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు, సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ కాంబినేషన్స్ మిస్ అయ్యాడనే విషయం మన అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియా లో మణిరత్నం, శంకర్, రాజమౌళి వంటి దిగ్గజాలు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళను తప్పించుకొని తనకి అనుకూలమైన చిన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. కెరీర్ మొత్తం మీద ఆయన పనిచేసిన స్టార్ డైరెక్టర్స్ కేవలం ఇద్దరు మాత్రమే. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, మరొకరు పూరీ జగన్నాథ్. పూరి జగన్నాథ్ ని సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం చేసింది పవన్ కల్యాణే, ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ సినిమా యావరేజ్ గా మిగిలింది.

    అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ కి ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’,’పోకిరి’, ‘గోలీమార్’ వంటి కథలను వినిపించాడు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే విధంగా పవన్ కళ్యాణ్, దీపికా పదుకొనే కాంబినేషన్ లో గతం లో ఒక సినిమా సెట్ అయ్యింది. కానీ ఆమెకు డేట్స్ సర్దుబాటు కాక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ సినిమా మరేదో కాదు ‘తీన్ మార్’. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన సైఫ్ అలీ ఖాన్ ‘లవ్ ఆజ్కల్’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా బాగా అడ్వాన్స్ గా ఉండడంతో కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రం లో ముందుగా దీపికా పదుకొనే ని అనుకున్నారు, ఆమె కూడా అడగగానే డేట్స్ ఇచ్చింది. అయితే సినిమా అనుకున్న సమయంలో ప్రారంభించలేకపోయాడు నిర్మాత బండ్ల గణేష్.

    దీంతో దీపికా పదుకొనే కి డేట్స్ సమస్య రావడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత త్రిష ని తీసుకున్నారు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ, అదే సినిమాని ఇప్పుడు విడుదల చేస్తే మాత్రం కళ్ళు చెదిరే వసూళ్లు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. బండ్ల గణేష్ కూడా ఈ చిత్రాన్ని ఒక మంచి ముహూర్తం లో చూసుకొని, రీ ఎడిటింగ్ చేయించి, గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఒకవేళ విడుదల చేస్తే రీ రిలీజ్ చిత్రాలలో ఈ సినిమా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్స్ మొత్తం పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.