Homeఎంటర్టైన్మెంట్Rohit Sharma biopic: తెరపైకి క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్..టాలీవుడ్ యంగ్ హీరో కి క్రేజీ...

Rohit Sharma biopic: తెరపైకి క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్..టాలీవుడ్ యంగ్ హీరో కి క్రేజీ ఛాన్స్!

Rohit Sharma biopic: మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే. డైరెక్టర్స్ కి కూడా కొత్త కథలను రాయడానికి చాలా ఇబ్బంది అవుతోంది. ఇలాంటి సమయం లోనే బయోపిక్స్ చేస్తే చాలా బెటర్ అని, నిజ జీవితాల్లో ఉండే రియల్ ఎమోషన్స్ ని వెండితెర పై సరైన పద్దతిలో ఆవిష్కరిస్తే ‘మహానటి’ లాంటి వెండితెర అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇలాంటి సమయం లోనే సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నారని, అందులో రోహిత్ పాత్రని మన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చేయబోతున్నాడని ఒక ప్రచారం జరిగింది. దీనిపై నిన్న ‘బైకర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక క్లారిటీ ఇచ్చాడు హీరో శర్వానంద్. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ బయోపిక్ గురించి ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘మన దేశానికీ ఎంతో గర్వకారణంగా నిల్చిన, లెజెండ్ రోహిత్ శర్మ జీవిత చరిత్ర ప్రతీ ఒక్కరికి ఎంతో ఆదర్శవంతమైనది. అలాంటి లెజెండ్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటాను. కచ్చితంగా చేస్తాను. కానీ ఇప్పటి వరకు అయితే నా వద్దకు ఆ స్టోరీ తో ఏ డైరెక్టర్ రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. ఒకవేళ శర్వానంద్ తో ఏ డైరెక్టర్ అయినా ఈ బయోపిక్ ప్లాన్ చేస్తే, కచ్చితంగా భారీ రేంజ్ లో క్లిక్ అవ్వుద్ది అని చెప్పొచ్చు. ఒక బయోపిక్ సూపర్ హిట్ అవ్వాలంటే, ఎత్తుపల్లాలతో పాటుగా, సదరు లెజెండ్ జీవితం లో వచ్చిన పరాజయాలు, కష్టాలు కూడా చూపించాలి. ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉన్నప్పుడే ఇలాంటి బయోపిక్స్ సక్సెస్ అవుతుంటాయి. రోహిత్ శర్మ జీవితం కూడా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదే.

Also Read: హరీష్ శంకర్ ని రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఇక ఇతనికి అవకాశాలు ఇచ్చే హీరో ఎవరు?

ఒకానొక సమయం లో బీసీసీఐ ఆయన్ని టీం లోకి తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. అలాంటి స్థాయి నుండి ఇండియన్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా, ఎన్నో అద్భుతమైన రికార్డ్స్, మైల్ స్టోన్స్ ని అధిగమించి, ప్రపంచం లోనే గొప్ప బ్యాట్స్ మ్యాన్ గా, గొప్ప కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. గత ఏడాది T20 వరల్డ్ కప్ ని మన ఇండియన్ టీం ని అందించి ఆ ఫార్మటు కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, ప్రస్తుతానికి ఒన్డే ఫార్మటు లో మాత్రమే కొనసాగుతున్నాడు. అదే విధంగా IPL లో ముంబై ఇండియన్స్ టీం తరుపున ఆడబోతున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper