Rocking Rakesh-Sujatha : పెళ్లి కాకముందే అలా.. సుజాతపై రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్

అంతేకాదు భర్త హీరోగా రాబోతున్నందుకు ఆయనకు సహకరిస్తూ..చేదోడువాదోడుగా నిలబడుతుందట సుజాత.

Written By: NARESH, Updated On : November 6, 2023 3:37 pm
Follow us on

Rocking Rakesh – Sujatha : జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చింది. అందులో ఒకరు రాకింగ్ రాకేష్ అని చెప్పాలి. ఈయన కామెడీతో చాలా ఫేమస్ అయ్యారు. ఇలా కామెడీ షో ద్వారా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన కేసీఆర్ అనే సినిమాను సొంతంగా నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల గురించి బిజీ బిజీగా ఉన్నాడు రాకింగ్ రాకేష్. రీసెంట్ గానే యాంర్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు ఈ కమెడియన్. జోర్దార్ వార్తల ద్వారా ఫేమస్ అయినా ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ తర్వాత నేమ్, ఫేమ్ సంపాదించిన సుజాత నటిగా కూడా అదరగొడుతుంది. అంతేకాదు రాకింగ్ రాకేష్ తో జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆయన స్కిట్ లో చేస్తూ ఆయన ప్రేమలో పడింది ఈ యాంకర్. అలా ప్రేమలో పడిన ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ సుజాత గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సుజాత ఈయనను ప్రేమిస్తున్న విషయం తెలిసిన తర్వాత ఇదేంటి బలిచ్చే కోడిలా నా ప్రేమలో పడింది అనుకున్నాడట రాకేష్.

మంచి జాబ్ చేసుకొని నెలకు లక్షల్లో జీతం వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా నన్ను ప్రేమించడం ఏంటి? బలిచ్చే కోడిలాగా తయారైంది ఏంటి అనుకున్నాడట. అయితే రాకింగ్ రాకేష్ ఇతరుల పట్ల చూపించే ప్రేమ, గౌరవం, కేరింగ్ ను చూసి ఇష్టపడిందట సుజాత. ఈ విషయాలను స్వయంగా ఆమెనే తెలిపింది. అయితే వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ కెరీర్ ను సక్సెస్ ట్రాక్ లో నడిపిస్తున్నారు. ఇద్దరు కూడా సినిమాలు, షోలు, జబర్దస్త్ అంటూ ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. అంతేకాదు భర్త హీరోగా రాబోతున్నందుకు ఆయనకు సహకరిస్తూ..చేదోడువాదోడుగా నిలబడుతుందట సుజాత.