Robin Hood OTT Views: హీరో నితిన్(Nithin) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) ఈ ఏడాది మార్చి 28 న విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 70 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ నుండి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. ఇంత పెద్ద డిజాస్టర్ నితిన్ కెరీర్ లోనే లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థియేటర్స్ లో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది కానీ, ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని జీ 5 సంస్థ విడుదలకు ముందే ఫ్యాన్సీ రేట్ తో ఈ సినిమాని కొనుగోలు చేసింది. ఫ్లాప్ సినిమాని ఇంత పెట్టి కొన్నారు, పాపం జీ5(Zee5) సంస్థకు నష్టాలు తప్పవేమో అని అంతా అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రానికి ఓటీటీ లో ఇప్పటి వరకు 300 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయట. అనేక సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. పైగా ‘రాబిన్ హుడ్’ చిత్రం విడుదల అయ్యింది కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే. ఇప్పటికీ టాప్ 3 రేంజ్ లో ట్రెండ్ అవుతుందంటే ఏ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కంటెంట్ పరంగా చూస్తే ‘రాబిన్ హుడ్’ చిత్రంబాగానే ఉంటుంది. కానీ విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. అంతే కాకుండా ఈ సినిమా విడుదలైన రోజునే ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా విడుదల అవ్వడం, ఆ సినిమాకు మొదటి నుండి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో రాబిన్ హుడ్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
Also Read: Robin Hood : ‘రాబిన్ హుడ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎపిక్ డిజాస్టర్!
కానీ సినిమాలో డీసెంట్ స్థాయి కంటెంట్ ఉండడం వల్లే ఓటీటీ ఆడియన్స్ దీనిని ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకో రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే నితిన్ కొత్త సినిమా విషయానికి వస్తే, వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ‘తమ్ముడు’ అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తో నితిన్ భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల కానుంది.