Robin Hood Collections: యంగ్ హీరో నితిన్(Hero Nithin) కి పాపం అసలు ఏది కలిసి రావట్లేదు. నమ్మిన పని చాలా నిజాయితీగా చేస్తాడు, దానిని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తాడు, కానీ ఈమధ్య కాలంలో ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు ఫ్లాప్ అయిన సినిమాలు ఆయన్ని ఎంత బాధపెట్టి ఉంటాయో చెప్పలేము కానీ, రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం మాత్రం చాలా తీవ్రమైన మనస్తాపానికి గురి చేసి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నితిన్ చాలా గట్టిగా నమ్మాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూస్ లో నితిన్ ని ఇంత నమ్మకంతో మాట్లాడి ఉండడం ఇప్పటి వరకు ఆయన అభిమానులు కూడా చూసి ఉండరు. అలా ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆ చిత్రం, ఆయన కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందంటే, బాధ ఉంటుంది కదా.
Also Read: అలేఖ్య చిట్టి పికిల్స్ పై సెలబ్రెటీ షాకింగ్ వీడియో..
నిన్నటి వరకు ఈ సినిమా థియేటర్స్ లో డెఫిసిట్స్ లోనే ఆడింది. నేడు ఆ చిత్ర నిర్మాతలకు సంబంధించిన రెండు సినిమాలను విడుదల చేయడంతో రాబిన్ హుడ్ ని అన్ని థియేటర్స్ నుండి తీసేసారు. ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నితిన్ గత సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ’ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి నితిన్ కి ఇప్పుడు క్లోజింగ్ లో కూడా ఆరు కోట్ల రూపాయిల షేర్ రాకపోవడం గమనార్హం. ఇక ఓవర్సీస్+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ‘రాబిన్ హుడ్’ కి వచ్చింది కేవలం 6 కోట్ల 60 లక్షల రూపాయిలు మాత్రమే.
అంటే భీష్మ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు వచ్చిన వసూళ్లను, ‘రాబిన్ హుడ్’ క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ గా కూడా దాటలేకపోయింది అన్నమాట. ఇంతకంటే డిజాస్టర్ మరొకటి ఉంటుందా?, నితిన్ కచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎక్కడో ఎదో లోపం ఉంది. ఆ లోపాన్ని గుర్తించి సరిచేసుకోకపోతే మళ్ళీ ఆయన ఇష్క్ చిత్రానికి ముందు ఎదురుకున్న పరిస్థితులను చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో కలిసి ‘తమ్ముడు’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. మే నెలలో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, రాబిన్ హుడ్ ఎఫెక్ట్ తో వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘ఎల్లమ్మ’ అనే చిత్రం చేస్తున్నాడు.