Ritu Chaudhary: రీతూ చౌదరి తన వేదన తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తూ టార్చర్ పెట్టారని ఆమె షాకింగ్ మేటర్ బయట పెట్టారు. సైబర్ క్రైం లో కంప్లైంట్ చేయగా ఒకరిని అరెస్ట్ చేసినట్లు రీతూ చౌదరి వెల్లడించారు. విషయంలోకి వెళితే… ఆరు నెలలుగా తన మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తున్నారట. ఒకసారి డైరెక్ట్ గా ఆ వీడియోకి రీతూ చౌదరిని ట్యాగ్ చేయడంతో ఆమె చూసి షాక్ అయ్యారట. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదట. తన సన్నిహితులతో ఈ విషయం చర్చించారట.
మనం ఆ వీడియోల మీద స్పందిస్తే ఇప్పటి వరకు కొందరికే తెలిసిన విషయం అందరికీ తెలిసిపోవచ్చని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారట. బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ కి వీడియో చూపించి ఇది నేను కాదని చెప్పిందట. తప్పు చేయనప్పుడు నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం సైబర్ క్రైం లో కంప్లైంట్ చేద్దాం అన్నాడట. తల్లి, సోదరుడు, విష్ణుప్రియ తనకు అండగా నిలిచారట.
డైరెక్ట్ మెసేజ్ లలో వీడియోలు పోస్ట్ చేసేవారట. నైట్ కి వస్తావా? రేటు ఎంత?. ఆఫర్స్ లేక ఇలాంటి పనులు చేస్తున్నావా? అని కామెంట్స్ చేసేవారట. సైబర్ క్రైం విభాగంలో కంప్లైంట్ చేయగా ఒకరిని అరెస్ట్ చేశారట. అరెస్ట్ అయిన వాడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వాడిని వదిలేయాలని బావ రిక్వెస్ట్ చేశాడు. నేను కూడా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను. తెలియక చేశాడని వాడి బావ అన్నాడట. ఇంకా తనను వేధించిన వాళ్ళ ఐడీలు పోలీసులకు ఇచ్చాను. ఇంకా అరెస్ట్ లు జరుగుతాయని రీతూ చౌదరి వీడియోలు చెప్పింది…
రీతూ చౌదరి సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. పలు సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. అక్కడ బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది టీమ్ లో కొన్నాళ్ళు స్కిట్స్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ చేయడం లేదు. ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల విడుదలైన వ్యూహం సిరీస్లో ఓ పాత్ర చేసింది.