Ritu Chaudhary : టీవీ సీరియల్స్ మరియు సోషల్ మీడియా ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించిన రీతూ చౌదరి మరియు ఆమె ప్రియుడిపై నిన్న వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇబ్రహీంపట్నం లో రీతూ చౌదరి తన ప్రియుడు చీమకుర్తి శ్రీకాంత్ తో కలిసి 700 కోట్ల రూపాయిల స్కాం చేసారని, అమాయకులను కిడ్నాప్ చేసి గోవాకి తరలించి వాళ్ళ చేత బలవంతంగా భూములు రాయించుకున్నారని మాజీ రిజిస్టర్ ధర్మ సింగ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేసాడు. దీనిపై సోషల్ మీడియా లో అనేక కథనాలు ప్రచురితం అయ్యాయి. ఒక ప్రముఖ పార్టీ ముఖ్య నేతలు దగ్గరుండి శ్రీకాంత్ తో ఈ భారీ కుంభకోణం కి తలపడ్డారని, తీగ లాగితే డొంక కదిలినట్టు, ఈ వ్యవహారం లో ఎంతో మంది పెద్దలు ఉన్నారని వార్తలు వినిపించాయి.
దీనిపై రీతూ చౌదరి ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో అని ఎదురు చూసిన అభిమానులకు ఆమె షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ విడుదల సమయంలో ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. ఆ వీడియో లో ఎన్టీఆర్ ‘నన్ను అపార్థం చేసుకున్న వాళ్లకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏది అనుకుంటే అదే కరెక్ట్ అనుకో’ అని అంటాడు. దీనిని రీతూ చౌదరి తన స్టోరీ లో షేర్ చేసి తనపై వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా సమాధానం అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అంటే నాకు ఈ స్కాం లో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొస్తుందా? అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం రీతూ చౌదరి స్టేటస్ సింగిల్ గానే ఉంది. గతం లో ఆమె శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిన విషయం వాస్తవమే కానీ, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల బ్రేకప్ జరిగింది.
రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత రీతూ చౌదరి గా మార్చుకుంది. మొదట్లో ఈమె పలు షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలా టీవీ ఆడియన్స్ కి దగ్గరైన ఈమె సోషల్ మీడియా లోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమెకు ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా వచ్చింది కానీ, ఎందుకో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో ఈ స్కాం లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.