https://oktelugu.com/

Niharika Konidela : గేమ్ చేంజర్’ కి చివరి నిమిషం లో పెద్ద తలనొప్పిగా మారిన నిహారిక కొణిదెల..అన్నయ్యకి ఇలా నష్టం చేస్తుందని అనుకోలేదు!

ఈ చిత్రానికి ఎలాంటి అడ్డంకి లేదని అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల అడ్డంకి గా మారింది. రీసెంట్ గానే ఆమె తమిళం లో 'మద్రాస్ కారన్' అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇందులో షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా నటించగా, నిహారిక తో పాటు ఐశ్వర్య దుత్త మరో హీరోయిన్ గా నటించింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 5, 2025 / 06:34 PM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రస్తుతం ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి నుండి ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, నిన్న రాజమండ్రి లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ హైప్ తారాస్థాయికి చేరుకుంది. మొదటి రోజు ఎంత వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు లెక్క కాదు, ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందా లేదా?, పుష్ప 2 ని అధిగమిస్తుందా అనేదే లెక్క. రామ్ చరణ్ కోసమే అన్నట్టుగా అజిత్ తమిళ చిత్రం ‘విడాముయార్చి’ కూడా వాయిదా పడింది. దీంతో గేమ్ చేంజర్ కి ఇప్పుడు సోలో రిలీజ్. తమిళ ప్రేక్షకులకు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ చిత్రం మాత్రమే చూసేందుకు అవకాశం. పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా పోటీ లో లేకపోవడంతో ఈ చిత్రం తమిళనాడు లో మొదటి రోజు 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    టాక్ బాగుంటే అవలీలగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం అందుకోగలడు. శంకర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు కానీ, ఆయనకీ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఈ చిత్రం తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే సృష్టిస్తుంది. ఈ చిత్రానికి ఎలాంటి అడ్డంకి లేదని అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల అడ్డంకి గా మారింది. రీసెంట్ గానే ఆమె తమిళం లో ‘మద్రాస్ కారన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇందులో షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా నటించగా, నిహారిక తో పాటు ఐశ్వర్య దుత్త మరో హీరోయిన్ గా నటించింది.

    ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఈ చిన్న సినిమా పోటీనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చిత్రం నుండి విడుదలైన ఒక పాటకు మంచి రెస్పాన్స్ అవచ్చింది. యూత్ ఆడియన్స్ ఈ చిత్రం పై ఆసక్తిగానే ఉన్నారు. ఈ సినిమా విడుదల అవ్వడం వల్ల 100 శాతం థియేటర్స్ లో విడుదల అవ్వాల్సిన గేమ్ చేంజర్ ఇప్పుడు కొంత శాతం థియేటర్స్ ని కోల్పోతుంది. రెండు చిత్రాలు కూడా ఒకే రోజు విడుదల అవ్వబోతుండడం వల్లే రామ్ చరణ్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళ ఆడియన్స్ కి మాత్రం మొదటి ఛాయస్ గా ‘గేమ్ చేంజర్’ మాత్రమే ఉండబోతుంది. రేపు లేదా ఎల్లుండి నుండి తమిళనాడు లో గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నారు. ప్రారంభం లో ఉండే బుకింగ్స్ ట్రెండ్స్ ని బట్టి ఈ సినిమా తమిళ వెర్షన్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత ఉంటుంది అనేది ఒక అంచనాకి రావొచ్చు.