Ritu Chaudhary out of Bigg Boss 9: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి సెలబ్రిటీస్ జాబితా లో అడుగుపెట్టిన రీతూ చౌదరి(Ritu Chowdary), హౌస్ లో ఉన్న వాళ్లందరిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు అందరూ. సీజన్ మొదలయ్యే ముందు ఈమె హౌస్ లోకి రాబోతుంది అనే విషయం తెలిసినప్పుడు కచ్చితంగా ఈమె టాప్ 5 వరకు చేరుకుంటుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ వారమే ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓటింగ్ పరంగా మాత్రమే కాకుండా, బయట ఆమెపై ప్రస్తుతం అనేక వివాదాలు చుట్టుకోవడం తో ఆమెని హౌస్ నుండి బయటకు పంపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. రీతూ చౌదరి తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ వారం లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ప్రస్తుతం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు.
ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే అందరికంటే టాప్ ఓటింగ్ తో ఫ్లోరా షైనీ కొనసాగుతుండడమే. ఈ వారం కూడా ఆమె సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో కెప్టెన్ డిమోన్ పవన్ కళ్యాణ్ నామినేట్ అయిన ఇంటి సభ్యుల నుండి ఒకరిని సేవ్ చేసే అవకాశం కలిపించాడు బిగ్ బాస్. అప్పుడు డిమోన్ పవన్ కచ్చితంగా రీతూ చౌదరి ని సేవ్ చేస్తాడని అనుకున్నారు ఆడియన్స్. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య రిలేషన్ అలాంటిది. దానిని ఆడియన్స్ అందరూ చూసారు. కానీ డిమోన్ పవన్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రీతూ కి బదులుగా శ్రీజ ని సేవ్ చేసాడు. దీనికి రీతూ చౌదరి చాలా ఏడ్చింది. బహుశా ఈసారి నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అవుతానని ఆమె బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు, అందుకే అంత ఫీల్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.
దానికి తోడు ఈ వారం అగ్నిపరీక్ష షో నుండి ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బుధవారం అర్థ రాత్రి రోజున దివ్య నిఖిత, నాగ ప్రశాంత్, అనూష రత్నం మరియు షకీబ్ హౌస్ లోకి అడుగుపెడుతారని, ఈ నలుగురికి బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ ని నిర్వహిస్తారని, ఆ టాస్క్ లో గెలిచిన ఒక కంటెస్టెంట్ ని హౌస్ లోనే ఉంచి మిగతా వాళ్ళని పంపిస్తారని అంటున్నారు. ఈ ఎపిసోడ్ మనకు గురువారం రోజున టెలికాస్ట్ కానుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి రీతూ, కళ్యాణ్ లను ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. రీతూ చౌదరి ని బుధవారం ఎపిసోడ్ లోనే బయటకు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.