Homeఅంతర్జాతీయంIndia Bangladesh border: భారత్‌–బంగ్లా మధ్య కొత్త దేశం.. అమెరికా క్రిస్టియన్‌ కంట్రీ కుట్ర..!

India Bangladesh border: భారత్‌–బంగ్లా మధ్య కొత్త దేశం.. అమెరికా క్రిస్టియన్‌ కంట్రీ కుట్ర..!

India Bangladesh border: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రప్‌ ఎన్నికయ్యాక భారత్‌పై సుంకాలు, ఆంక్షలు పెరిగాయి. ఇక ట్రంప్‌ రాక ముందే అమెరికా భారత్‌పై కుట్ర చేస్తోంది. ఎదుగుదలను ఓర్వలేకపోతోంది. దీంతో భారత్‌ను దెబ్బతీయడం ద్వారా అటు చైనాకు, ఇటు ఇండియాకు చెక్‌ పెట్టాలని మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య కొత్త దేశం ఏర్పాటుకు కుట్ర చేస్తోంది. షేక్‌ హసీనా అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం బయట పెట్టింది. కానీ, అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అమెరికా సాగిస్తున్న కార్యకలాపాలు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. 2023 మే 3 నుంచి మణిపూర్‌లో మేథీ మరియు కూకీ–జో కమ్యూనిటీల మధ్య జరుగుతున్న జాతి సంఘర్షణలు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సంఘర్షణల్లో 260 మంది మరణించారు, 60 వేల మంది వలసలు వెళ్లారు. ఈ ఘటనలు కేవలం స్థానిక భూమి, ల్యాండ్‌ రైట్స్‌ విషయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో ముడిపడి ఉన్నాయనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా 2024 మేలో అమెరికా బంగ్లాదేశ్, మయన్మార్‌ మధ్య క్రిస్టియన్‌ దేశం (ఈస్ట్‌ తిమూర్‌ లాంటిది) ఏర్పాటు చేయాలని కుట్ర పన్నుతోందని చెప్పారు. ఆమె అధికారం నుంచి తొలగించడం, సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్‌పై మిలిటరీ బేస్‌ కోరికలు వెనుక అమెరికా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలు భారత్‌ నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాలు, ముఖ్యంగా మణిపూర్‌లోని కూకీ ప్రాంతాలను కలుపుకుని ప్రత్యేక ’జో’ దేశం ఏర్పాటుకు విస్తరిస్తాయని విశ్లేషకులు అంచనా.

క్రిస్టియన్‌ దేశం కుట్ర వెనుక అమెరికా?
2024 మేలో షేక్‌ హసీనా తమ 14 పార్టీ అలయన్స్‌ సమావేశంలో ఒక వ్యక్తి (వైట్‌ మ్యాన్‌) ఎయిర్‌ బేస్‌ కోరికతో వచ్చాడని, బంగ్లాదేశ్, మయన్మార్‌ భాగాలతో బెంగాల్‌ బేలో క్రిస్టియన్‌ దేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈస్ట్‌ తిమూర్‌ ఉదాహరణ ఇచ్చి, సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్‌పై మిలిటరీ బేస్‌ అనుమతిస్తే ఎన్నికల్లో సమస్యలు ఉండవని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఆమె ఒప్పుకోకపోవడంతో, 2024 ఆగస్టులో అధికారం నుంచి తొలగించడంతోపాటు దేశం విడిచిపోయేలా చేశారు. అవామీ లీగ్‌ నాయకులు ఈ కుట్ర ’జో’ రాష్ట్రం (కూకీ–చిన్‌–మిజో ప్రజలు) ఏర్పాటుకు సంబంధించినదని చెబుతున్నారు, ఇది భారత్‌ మిజోరాం, మణిపూర్‌లోని కూకీ ప్రాంతాలను కలుపుకుంటుంది. మిజోరాం సీఎం లాల్దుహోమా 2024 నవంబర్‌లో అమెరికాలో ’జో’ ప్రజలకు ఒకే పాలిటికల్‌ యూనిట్‌ అవసరమని చెప్పడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.

మణిపూర్‌ సంఘర్షణలు..
మణిపూర్‌లో 2023 ఏప్రిల్‌లో హైకోర్టు మేథీలకు ఎస్టీ స్టేటస్‌ ఇవ్వాలని సూచించడంతో ట్రైబల్‌ మార్చ్‌లు జరిగి, మే 3 నుంచి మేథీ (హిందూ, వ్యాలీ) మరియు కూకీ–జో (క్రిస్టియన్, హిల్స్‌) మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి. మేథీలు భూమి రైట్స్, పాపీ కల్చరేషన్, మయన్మార్‌ రెఫ్యూజీలపై ఆరోపణలు చేస్తున్నారు. కూకీలు సెపరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 2025 ఫిబ్రవర్‌లో సీఎం బీరెన్‌ సింగ్‌ రాజీనామా చేసి ప్రెసిడెంట్‌ రూల్‌ విధించబడింది, కానీ సంఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు కావాలనే క్రియేట్‌ చేసినవని, మ్యాండ్‌ రాజ్యసభ సభ్యుడు హైనాకా లంబా ’ఫారిన్‌ హ్యాండ్‌’ ఉందని ఆరోపించారు. మార్చి 2025లో హెచ్‌ఆర్‌డబ్ల్యూ రిపోర్టు ప్రకారం, రెండు వైపులా మిలిటెంట్‌ గ్రూపులు యాక్టివ్‌ అయ్యాయి, ప్రభుత్వం మేథీలకు బయాస్‌ చూపింది.

మిషనరీలు, స్టార్‌లింక్, ఆయుధాలు..
మణిపూర్‌ సంఘర్షణల్లో అమెరికా పరోక్ష పాత్ర ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 2024 డిసెంబర్‌లో అమెరికన్‌ మిషనరీలు కూకీలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్టులు, ఆయుధాలు సప్లై చేస్తున్నారని వీడియోలు వైరల్‌ అయ్యాయి. స్టార్‌లింక్‌ (అమెరికా కంపెనీ) ఇంటర్నెట్‌ సర్వీస్‌ కూకీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది, ఇది ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా ఉంది. కూకీ నేషనల్‌ ఆర్మీ (కేఎన్‌ఏ) చైర్మన్‌ పీఎస్‌.హావ్కిప్‌ మయన్మార్‌ ఒరిజిన్‌తో ఇజ్రాయిల్‌కు లెటర్‌ రాసి కూకీలను ’లాస్ట్‌ ట్రైబ్‌ ఆఫ్‌ ఇజ్రాయిల్‌’గా గుర్తించమని కోరారు. ఈ చర్యలు కూకీలను బలోపేతం చేసి, సంఘర్షణలను ఇంధనం చేస్తున్నాయని భారత ఇంటెలిజెన్స్‌ సోర్సెస్‌ చెబుతున్నాయి. అమెరికా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్‌ కాకపోయినా, మిషనరీ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రభావం చూపుతోంది.

బంగ్లాదేశ్‌లో అమెరికా చర్యలు..
షేక్‌ హసీనా పతనం వెనుక అమెరికా ఉందని అవమి లీగ్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. 2024 జనవరి ఎన్నికల్లో అమెరికా ’ఫ్రీ అండ్‌ ఫెయిర్‌’ ఎలక్షన్స్‌ పేరిట ఒత్తిడి తెచ్చింది, బీఎన్‌ఆర్, జమాత్‌–ఇ–ఇస్లామీకి మద్దతు ఇచ్చింది. హసీనా ఒప్పుకోకపోవడంతో, 2024 ఆగస్టు క్వోటా ప్రొటెస్టులు అల్లర్లుగా మారి, ఆమె పలాయనం చేశారు. 2025 సెప్టెంబర్‌లో చిట్టాగాంగ్‌లో యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సీ–130జే ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండింగ్, ’పసిఫిక్‌ ఏంజెల్‌ 25–3’ ఎక్సర్‌సైజ్‌లు జరుగుతున్నాయి. ఈ చర్యలు మయన్మార్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దులో మాసివ్‌ ఆపరేషన్‌లకు సంబంధించినవని ఆందోళనలు ఉన్నాయి. అల్‌ ఉదీద్‌ ఎయిర్‌ బేస్‌కు కనెక్టెడ్‌ యూఎస్‌ఏఎఫ్‌ ఆఫీసర్లు ఢక్కాలో బేస్‌ సెటప్‌ చేస్తున్నారు.

అమెరికా లక్ష్యాలు ఇవీ..
అమెరికాకు ఈ కుట్రల వెనుక భౌగోళిక రాజకీయాలు ఉన్నాయి. కొత్త ’జో’ దేశం ఏర్పడితే, అమెరికా మిలిటరీ బేస్‌ ఏర్పాటు చేసి, ఇండియా, చైనాను మానిటర్‌ చేయవచ్చు. బెంగాల్‌ బేలో సెయింట్‌ మార్టిన్‌ ఐలాండ్, చిట్టాగాంగ్‌ పోర్ట్‌లు స్ట్రాటజిక్‌గా ముఖ్యం, ఇక్కడి నుంచి మలాక్కా స్ట్రెయిట్, చైనా ఆయిల్‌ పైప్‌లైన్‌లు కంట్రోల్‌ చేయవచ్చు. మణిపూర్, మిజోరాం, చిట్టాగాంగ్, రాఖిన్‌ ప్రాంతాలు రెసోర్సెస్‌ (మినరల్స్, ఆయిల్, గ్యాస్‌) రిచ్‌గా ఉన్నాయి. అమెరికా ’ఇండో–పసిఫిక్‌’ వ్యూహంలో చైనా అడ్డుకోవడానికి ఈ బేస్‌ అవసరం. 2025 మేలో మయన్మార్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దులో యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్లు బేస్‌ సెటప్‌ చేస్తున్నారని రిపోర్టులు ఈ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version