Rithu Chowdary Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో అత్యధిక శాతం ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి. గత సీజన్స్ లో సోషల్ మీడియా లో జరిగే పోలింగ్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఎలిమినేషన్స్ ఉండేవి. కానీ ఈసారి మాత్రం అలా లేదు. బిగ్ బాస్ టీం ఆడియన్స్ కి ఊహించని ట్విస్టులను ఇస్తున్నారు. ఈ వారం సోషల్ మీడియా లో జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే సుమన్ శెట్టి కచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి. అధికారిక ఓటింగ్ లో కూడా ఆయనకే తక్కువ ఓటింగ్ వచ్చింది. బిజ్ బాస్ బజ్ ఎపిసోడ్ కోసం ఆయనకు సంబంధించిన ప్రశ్నలు కూడా రెడీ అయిపోవడం తో, సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాసేపటికే ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ అంటూ రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది.
ఎందుకంటే బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ కి ఆమెకు సంబంధించిన ప్రశ్నలు కూడా రెడీ చేసి ఉంచారట. వాస్తవానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఈ డబుల్ ఎలిమినేషన్ ద్వారా సుమన్ శెట్టి మరియు రీతూ చౌదరి ని ఎలిమినేట్ చెయ్యాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో నిర్ణయం మార్చుకున్నారు. రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేశారు. ఈరోజు రాత్రి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే పూర్తి అయ్యింది. రీతూ చౌదరి ఎలిమినేషన్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ మరికాసేపట్లో జరగనుంది. రీతూ చౌదరి కచ్చితంగా టాప్ 5 లో ఉండేందుకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న అమ్మాయి. ఈ వారం కూడా టాస్కులు మగవాళ్ళతో సమానంగా ఆడింది శబాష్ అనిపించుకుంది. అంతా బాగానే ఉంటుంది కానీ, ఎలా అయినా టాస్క్ గెలవాలి అనే తపనతో చివరి నిమిషం లో ఆమె చేసే కొన్ని కన్నింగ్ వేషాలు ఆడియన్స్ కి అసలు నచ్చలేదు.
ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో భరణి రింగ్ ని తన షర్ట్ లోపల దాచేయడం ఆడియన్స్ కి రక్తం మరిగిపోయేలా చేసింది. ఒక మంచి మనిషిని మోసం చేసి గెలిచింది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రీతూ తిడుతూ నెటిజెన్స్ వేల సంఖ్యలో రీల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఆమెకు బాగా ఎఫెక్ట్ పడింది. హాట్ స్టార్ లో ఈమెకు ఓటింగ్ సుమన్ శెట్టి కంటే తక్కువ వచ్చాయి కానీ, మిస్సెడ్ కాల్స్ లో మాత్రం సుమన్ శెట్టి కి ఎక్కువ ఓటింగ్ వచ్చిందట . అందుకే ఆయన్ని సేవ్ చేసి, రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేసినట్టు చెప్తున్నారు. మరికొంత మంది అయితే, కావాలనే బిగ్ బాస్ టీం రీతూ ని తొలగించారని. సుమన్ శెట్టి ని మ్యానేజ్మెంట్ కోటాలో తీసుకొచ్చి, టాప్ 5 వరకు పంపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు.