https://oktelugu.com/

సినీ ప్రియులు పండుగ చేసుకోండి..!

కరోనా ఎఫెక్టుతో అన్నిరంగాలు కుదేలవగా ఓటీటీలు మాత్రం లాభాలు గడించాయి. లాక్డౌన్.. కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ గత్యంతరలేక ఓటీటీల్లో రిలీజు చేయాల్సి వచ్చింది. గత ఆరేడు నెలలుగా ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులంతా వీటికి అలవాటుపడిపోయారు. మరికొద్దిరోజుల్లో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. అయినప్పటికీ ఓటీటీ హవా ఏమాత్రం తగ్గేలా కన్పించడం లేదు. Also Read: నాని చేయాల్సిన సినిమాలో యంగ్ హీరో ! థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీల్లో కొత్త సినిమాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 06:02 PM IST
    Follow us on

    కరోనా ఎఫెక్టుతో అన్నిరంగాలు కుదేలవగా ఓటీటీలు మాత్రం లాభాలు గడించాయి. లాక్డౌన్.. కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ గత్యంతరలేక ఓటీటీల్లో రిలీజు చేయాల్సి వచ్చింది. గత ఆరేడు నెలలుగా ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులంతా వీటికి అలవాటుపడిపోయారు. మరికొద్దిరోజుల్లో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. అయినప్పటికీ ఓటీటీ హవా ఏమాత్రం తగ్గేలా కన్పించడం లేదు.

    Also Read: నాని చేయాల్సిన సినిమాలో యంగ్ హీరో !

    థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీల్లో కొత్త సినిమాలు రావని.. వాటి హవా తగ్గుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని భిన్నంగా థియేటర్లకు సవాల్ విసురుతున్నాయి. థియేటర్లు ఓపెన్ అయ్యే సమయంలో కొత్త సినిమాలతో దండయాత్రకు దిగుతున్నారు. రానున్న రెండునెలల్లో వరుసగా రిలీజ్ చేసే కొత్త సినిమాలను ప్రకటించి థియేటర్ల బిజినెన్ ను దెబ్బకొట్టే ప్లాన్ చేస్తున్నాయి.

    ఇప్పటికే ఓటీటీలు అన్ని భాషలకు చెందిన కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశాయి. గత నాలుగైదు నాలుగులుగా కొత్త సినిమాలను విడుదల చేస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పొన్‌మగళ్ వందాల్.. పెంగ్విన్.. శకుంతలా దేవి.. సుజాతయుం సూఫియుం.. ఫ్రెంచ్ బిరియాని.. వి.. నిశబ్ధం.. బుజ్జిగాడు.. వివిధ భాషలకు చెందిన సినిమాలను ఇప్పటికే వారానికి ఒకటి చొప్పున రిలీజ్  చేశాయి.

    ఈనెలలోనే థియేటర్లు తిరిగి తెరుచుకోనుండటంతో ఓటీటీలు కొత్త సినిమాలను వరుసగా కొనుగోలు చేస్తూ జోరు చూపిస్తున్నాయి. అమేజాన్ ప్రైమ్.. హాట్ స్టార్.. తదితర ఓటీటీలు మరోసారి కొత్త సినిమాలతో దండయాత్రను దిగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా తొమ్మిది సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ప్రకటించింది. సూర్య చిత్రం ‘ఆకాశమే హద్దురా’ అక్టోబరు 30న విడుదల కానుంది. దీంతోపాటు కొత్తగా ఎనిమిది సినిమాలు అమేజాన్‌లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.

    Also Read: హీరో విశాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు..?

    విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నవంబరు 20న.. కూలీ నంబర్ వన్.. చలాంగ్.. దుర్గావతి(హిందీ).. మారా(తమిళం).. భీమసేన నలమహారాజ.. మన్నె నంబర్ 13(కన్నడ), హలాల్ లవ్ స్టోరీ(మలయాళం) సినిమాలు మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక హాట్ స్టార్ సైతం దిల్ బేచారా.. సడక్-2.. బుజ్.. లక్ష్మీబాంబ్ లాంటి పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎన్ని సినిమాలు సినీప్రియులను అలరిస్తాయో వేచిచూడాల్సిందే..!