బిర్యానీ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది.. ఎలా అంటే..?

గడిచిన ఏడు నెలల నుంచి దేశ ప్రజలు కరోనా కష్టాలు అనుభవిస్తున్నారు. కరోనా వ్యాప్తి వల్ల అమలైన లాక్ డౌన్ దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోవడానికి కారణమైంది. ఒకప్పుడు గొప్పగా జీవించిన కుటుంబాలు సైతం కరోనా వల్ల ఆకలి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల నేటికీ చాలా కుటుంబాలు ఆకలి బాధను అనుభవిస్తున్నాయి. అలా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో ఢిల్లీకి చెందిన రోహిత్ సర్దానా కూడా ఒకరు. అయితే ఊహించని విధంగా […]

Written By: Navya, Updated On : October 9, 2020 6:04 pm
Follow us on

గడిచిన ఏడు నెలల నుంచి దేశ ప్రజలు కరోనా కష్టాలు అనుభవిస్తున్నారు. కరోనా వ్యాప్తి వల్ల అమలైన లాక్ డౌన్ దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోవడానికి కారణమైంది. ఒకప్పుడు గొప్పగా జీవించిన కుటుంబాలు సైతం కరోనా వల్ల ఆకలి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల నేటికీ చాలా కుటుంబాలు ఆకలి బాధను అనుభవిస్తున్నాయి. అలా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో ఢిల్లీకి చెందిన రోహిత్ సర్దానా కూడా ఒకరు.

అయితే ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోయిన రోహిత్ బిర్యానీ వల్ల నేడు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఉద్యోగం లేకపోయినా తెలివి ఉంటే సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యమేనని రోహిత్ ప్రూవ్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వరకు రోహిత్ ఒక కాస్మోటిక్ కంపెనీలో మంచి స్థాయిలో ఉద్యోగం చేసేవాడు. కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో అతను కొన్నిరోజులు ఇంటిపట్టునే ఉండిపోయాడు.

అయితే రోహిత్ భార్య రజనీ భర్త అలా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో దిగులు చెందింది. వాళ్లను ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో రజనీ తను ఎంతో రుచిగా వండే బిర్యానీని అందరికీ వండిపెట్టి డబ్బులు సంపాదించాలని భావించింది. అనంతరం కారునే దుకాణంగా మార్చి బిర్యానీని అమ్మడం ప్రారంభించారు. తక్కువ ధరలోనే రుచికరమైన బిర్యానీ దొరకడంతో వినియోగదారులు ఆ బిర్యానీ వైపు ఆకర్షితులయ్యారు.

రజనీ రోజుకు నాలుగు గంటల సమయం శ్రమించి రుచికరమైన బిర్యానీని తయారు చేస్తోంది. ఎక్కువ మంది వెజ్ బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారని ఆమె వెల్లడించింది. రోజూ ఉదయం నుంచి మధాహ్నం మూడు గంటల వరకు బిర్యానీని విక్రయిస్తున్నామని తెలిపింది. ఆ విధంగా బిర్యానీ రోహిత్ జీవితాన్నే మార్చేసింది.