https://oktelugu.com/

Vettiyan Movie Review : రజినీకాంత్ ‘వెట్టియాన్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ లో ‘విలన్’ ఎవరో తెలిసే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వుద్ది!

ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. అనిరుద్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 07:31 PM IST

    Vettiyan Movie Review

    Follow us on

    Vettiyan Movie Review : ‘జైలర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన జ్ఞాన్ వేల్ రాజా దర్శకత్వం లో ‘వెట్టియాన్’ అనే చిత్రం చేసాడు. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. ఈ పాటలకు ముందు సినిమా మీద అంచనాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఈ పాటల తర్వాత ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. అనిరుద్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాడు.

    రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అనిరుద్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బలహీనమైన సన్నివేశాలను కూడా ఆయన తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరో లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు. అలాంటి అనిరుద్ నుండి ఇంత నీరసంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అని అభిమానులు తిట్టుకున్నారు. అయితే అదంతా డైరెక్టర్ అభిరుచి కి తగ్గట్టుగా ఉంటుందని, డైరెక్టర్ కోరికను బట్టే అనిరుద్ అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు వివరించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని తెలుగు లో కూడా ‘వెట్టియాన్’ అనే టైటిల్ తోనే విడుదల చేస్తున్నారు. వెట్టియాన్ అంటే తెలుగు లో అర్థం ‘వేటగాడు’ అని. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తెలుగు దబ్ వెర్షన్ ప్రివ్యూ షో ని బయ్యర్స్ వేసి చూపించారట. సినిమా మొత్తం జ్ఞాన్ వేల్ రాజా స్టైల్ లో ఆసక్తికరంగా సాగుతుందట. నగరం లో వరుసగా మహిళలు హత్య కి గురి కావడం, ఆ హత్యలు చేస్తున్న విలన్ ని పట్టుకోవడం అనే అంశం పైనే ఈ చిత్రం తెరకెక్కింది. స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే బాగా నడిపించాడని ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నారు.

    రజినీకాంత్ మార్క్ హీరోయిజం ఉందని, ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం బాగా నచ్చుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడట. ఆ విలన్ ఎవరో తెలిసే ట్విస్ట్ కి ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోతాయని అంటున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా, రజినీకాంత్ ఇందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు.