Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty unfollows Kantara team Instagram: 'కాంతారా' టీంని ఇన్ స్టాగ్రామ్ లో 'Unfollow'...

Rishab Shetty unfollows Kantara team Instagram: ‘కాంతారా’ టీంని ఇన్ స్టాగ్రామ్ లో ‘Unfollow’ కొట్టిన రిషబ్ శెట్టి.. అసలు ఏమి జరుగుతోంది..

Rishab Shetty unfollows Kantara team Instagram: ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘కాంతారా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతారా 2: చాప్టర్ 1’ అయితే పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామీ ని నెలకొల్పి, దాదాపుగా 850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ఈ రెండు సినిమాలకు కలిపి 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. త్వరలోనే ‘కాంతారా 3’ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిమానులు కోరుకుంటున్న సమయం లో రిషబ్ శెట్టి ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఈ రెండు చిత్రాలను నిర్మించిన హోమబుల్ సంస్థ ని, అదే విధంగా ‘కాంతారా 2’ లో హీరోయిన్ కమ్ విలన్ గా నటించిన రుక్మిణి వాసంత్ లను అన్ ఫాలో కొట్టడం గమనార్హం.

ఎందుకు ఇప్పుడు వీళ్ళను రిషబ్ శెట్టి అన్ ఫాలో కొట్టాడు ?, వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా ?, లేకపోతే వేరే ఏదైనా కారణం చేత అన్ ఫాలో కొట్టాడా ? అనేది తెలియడం లేదు. ‘కాంతారా 3’ ని ‘హోమబుల్ ఫిలిమ్స్’ సంస్థ లో నిర్మించడానికి రిషబ్ శెట్టి ఇష్టం చూపించడం లేదా ?, అందుకే అన్ ఫాలో కొట్టాడా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది పక్కన పెడితే రుక్మిణి వాసంత్ ని ఎందుకు అన్ ఫాలో కొట్టాడు? , ఆమె పాత్ర ఎలాగో ‘కాంతారా 3’ లో ఉండదు, ఎందుకంటే పార్ట్ 2 లోనే ఆమె చంపేస్తాడు కాబట్టి, ఇక ఆమెతో అవసరం లేదు కాబట్టే అన్ ఫాలో కొట్టాడా ?, అయినప్పటికీ కొట్టాల్సిన అవసరం ఏముంది? , కచ్చితంగా ఎదో పెద్ద గొడవే వీళ్ళ మధ్య జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: హరీష్ శంకర్ కి స్పాట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రస్తుతం రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రం లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఈ సినిమాతో పాటుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర లో కూడా ఆయన నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు కూడా వెయ్యి కోట్లు కొట్టేంత స్టామినా ఉంది, ఇవి కాకుండా ‘కాంతారా 3 ‘ కూడా లైనప్ లో ఉంది. రాబోయే రోజుల్లో ఈయన పాన్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా అవతరించే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular