Homeబిజినెస్Best small investment plan: 30 ఏళ్ల వయసులో నెలకు రూ.14,500 పెట్టుబడి.. 15 ఏళ్లలో...

Best small investment plan: 30 ఏళ్ల వయసులో నెలకు రూ.14,500 పెట్టుబడి.. 15 ఏళ్లలో కోటి.. ఈ చిన్న పనిచేస్తే చాలు

Best small investment plan: కష్టపడింది డబ్బు ఊరికే రాదు. అయితే ఉదయం, రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డ డబ్బును వృధాగా పోనీయకుండా దానిని రెట్టింపు చేసే ప్రయత్నం చేయాలి. కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ దానిని పెంచే ప్రయత్నం చేయరు. అంటే ఈ డబ్బులు అవసరమైన చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రణాళిక ప్రకారంగా ఉండాలి. ఇందులో భాగంగా 30 ఏళ్ల వయసులో ఉన్నవారు 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే కోటి రూపాయల వరకు రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది బంపర్ లాటరీ నో లేదా ఇతర పెట్టుబడులు కాదు.. అధికారికంగా ప్రణాళిక ప్రకారంగా డబ్బులు మళ్ళించడం. అది ఎలాగంటే?

30 ఏళ్ల వయసు రాగానే చాలామంది యువత కొత్త ఉద్యోగంలో చేరుతూ ఉంటారు. ఇలా చేరగానే కొత్త ఇల్లు లేదా కొత్త వాహనము కొనుగోలు చేస్తారు. కానీ వీటిని కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి అదనపు ఆదాయాన్ని పొందలేరు. అయితే ఇప్పటినుంచే ప్రత్యేకంగా పెట్టుబడులపై ఆలోచన ఉంటే భవిష్యత్తులో కోట రూపాయలు సంపాదించుకోవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో ఉన్నవారు నెలకు రూ. 14,500 పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత రూ. కోటి సంపాదించుకోవచ్చు. ఇందులో భాగంగా రూఫ్ 5000 గోల్డ్ లో, రూ.9,500 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ పాటించాల్సింది ఏమిటంటే ప్రతి ఏడాది పెట్టుబడిని 10% పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి ఏడాది రూ.9,500 పెట్టుబడి పెడితే రెండు ఏడాది మరో రూ.500 వరకు పెంచుతూ వెళ్లాలి. ఇలా పెంచుకుంటూ పోతే 15 సంవత్సరాల్లో రూ. 82 లక్షల రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. అదే గోల్డ్ పై నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలలో 7 నుంచి 8% రాబడి వచ్చి రూ. 20 లక్షల వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఇలా స్థిరంగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళితే మార్కెట్ ప్రభావం ఎక్కువగా పడకుండా కనీస లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా ఆర్థిక భారం పడకుండా అవసరమైనప్పుడు డబ్బులు తీసుకొని వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే 10 సంవత్సరాల వరకు కూడా ప్లాన్ చేసుకుంటే అందుకు తగినంత రాబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 30 ఏళ్ల వయసులో ఇలాంటి పెట్టుబడులను ఎంచుకుంటే 45 ఏళ్లు వచ్చేసరికి పిల్లల విద్య, అప్పులు లేని జీవితం, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి సమయంలో ఉద్యోగ భయం ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉండవు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular