Rishab Shetty Comments On Ranveer Singh: పాన్ ఇండియా లెవెల్ లో కాంతారా(Kanthara 2 Movie) సిరీస్ సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా మర్చిపోగలమా చెప్పండి?..మొదటి భాగానికి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ భాగానికి 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ కర్ణాటక లో ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈ సినిమాలో హీరో గా నటించడమే కాకుండా , దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకొని రిషబ్ శెట్టి(Rishab Shetty) తనలోని అద్భుతమైన ప్రతిభ ని ఏ స్థాయిలో చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా తన సినిమాని, సినిమాలోని హీరో క్యారక్టర్ ని వెక్కిరిస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సోషల్ మీడియా లో విపరీతమైన నెగిటివిటీ ని ఎదురుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే గోవా లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ అట్టహాసం గా జరిగింది. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా రణవీర్ సింగ్(Raveer Singh) వ్యవహరించాడు. ఇక్కడ ఆయన కాంతారా 2 లో హీరో రిషబ్ శెట్టి చేసిన నటనని వెక్కిరిస్తూ, దెయ్యం లాగా భలే చేసావు, కాంతారా 3 లో ఇంకెలా చేస్తావో అంటూ అవహేళన చేసాడు. ఈ చర్య పై రిషబ్ శెట్టి తన అసంతృప్తి ని ఆరోజే వ్యక్తం చేసాడు. సోషల్ మీడియా కూడా భగ్గుమంది. తనపై ఏర్పడిన ఈ నెగిటివిటీ కి రణవీర్ సింగ్ స్పందిస్తూ ‘రిషబ్ శెట్టి కాంతారా లో అద్భుతంగా చేసాడు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఆయనలాగా నటించడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. ఎంత కష్టమైన సన్నివేశం లో అయినా ఆయన అద్భుతంగా నటించగలరు కాబట్టే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలోని అన్ని సంప్రదాయాలపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆరోజు నేను చేసిన పనికి ఎవరి మనసు అయినా నొచ్చుకొని ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిషబ్ శెట్టి ఈ సంఘటన పై స్పందిస్తూ ‘రణవీర్ సింగ్ ఆరోజు అలా చేయడం నన్ను చాలా బాధ పెట్టింది. దైవిక సంబంధాల గురించి తెరకెక్కించిన సినిమా అది. అలాంటి సినిమాలపై కామెడీ చేయొద్దని నేను ప్రతీ ఈవెంట్ లో రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. దాంతో మా కన్నడ ప్రజలకు ఎంతో ఎమోషనల్ కనెక్షన్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ లో హీరో గా నటిస్తున్నాడు.,ఈ సినిమాతో పాటు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు.