IPL Mini Auction 2026: ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ కు సంబంధించి మినీ వేలం అబుదాబి(Abu Dhabi) వేదికగా జరుగుతోంది. ఈ వేలంలో పర్స్ వేల్యూ ఎక్కువగా ఉన్న జట్లు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ కు 25.20 కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఇది హైయెస్ట్ అమౌంటుగా కొనసాగుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ను రెండు కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టు శ్రీలంక ఆటగాడు హసరంగను రెండు కోట్లకు కైవసం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంకటేష్ అయ్యర్ ను ఏడు కోట్లకు దక్కించుకుంది. వెంకటేష్ అయ్యర్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. అతడిని కొనుగోలు చేసింది.
క్వింటన్ డికాక్ కు కోటి చెల్లించి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెన్ డకెట్ ను రెండు కోట్లకు సొంతం చేసుకుంది. పిన్ అలెన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రెండు కోట్లకు దక్కించుకుంది. జాకబ్ డఫీ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు కోట్లు చేసుకుంది.
మతిషా పతిరణ ను 18 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. ఇతడి బేస్ ధర రెండు కోట్లు. దక్షిణాఫ్రికా ఆటగాడు నోకియాను లక్నో జట్టు రెండు కోట్లకు సొంతం చేసుకుంది.
రవి బిష్ణోయ్ ని రాజస్థాన్ రాయల్స్ రెండు కోట్లకు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు అఖిల్ హుస్సేన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది.
యంగ్ ప్లేయర్ అకీబ్ దార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లకు చేసింది. ఇతడి కోసం ఢిల్లీ, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్లకు దక్కించుకుంది.
అన్ని జట్లు ప్లేయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తుంటే.. హైదరాబాద్ మాత్రం శివాంగి కుమార్ అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది.
కార్తీక్ శర్మ అనే ఆటగాడిని చెన్నై జట్టు 14.2 0 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి కోసం కోల్కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి..
ముకుల్ చౌదరి అనే ఆటగాడిని 2.60 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్, లక్నో పోటీపడ్డాయి.
తేజస్వి సింగ్ అనే ఆటగాడిని మూడు కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ విపరీతంగా పోటీ పడ్డాయి.
అశోక్ శర్మ అనే ఆటగాడిని 90 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి.
కార్తీక్ త్యాగి అనే ఆటగాడిని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 30 లక్షలకు దక్కించుకుంది.
లక్నో జట్టు నమన్ తివారి అనే ఆటగాడిని 30 లక్షలకు సొంతం చేసుకుంది. సుశాంత్ మిశ్రా అనే ఆటగాడికి రాజస్థాన్ జట్టు 90 లక్షలు వెచ్చించింది.
విగ్నేష్ అనే ఆటగాడికి 30 లక్షలు చెల్లించింది రాజస్థాన్ జట్టు…
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్రశాంత్ సోలంకి అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది.