https://oktelugu.com/

హీరో మరణం హీరోయిన్ని వదిలేలా లేదు !

హీరోయిన్ ‘రియా చక్రవర్తి’ బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్నో అవమానాలు మరెన్నో కష్టాలు పడింది. లాక్ డౌన్ టైంలో మొత్తం ఇండియా వైడ్ గా హల్ చల్ చేసిన ఈ బ్యూటీకి అది పెద్ద ఎదురుదెబ్బే. మధ్యలో ఆరోపణలు, అపవాదులు.. చివరకు జైలు జీవితం.. దీనికితోడు డ్రగ్స్ కేసు, మొత్తంగా రియా జీవితమే తలక్రిందులైంది. ఎలాగోలా బెయిల్ పై బైటికి వచ్చాకా, కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండాపోయి, రీసెంట్ గానే మళ్ళీ కెరీర్ పై […]

Written By:
  • admin
  • , Updated On : February 26, 2021 / 06:13 PM IST
    Follow us on


    హీరోయిన్ ‘రియా చక్రవర్తి’ బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్నో అవమానాలు మరెన్నో కష్టాలు పడింది. లాక్ డౌన్ టైంలో మొత్తం ఇండియా వైడ్ గా హల్ చల్ చేసిన ఈ బ్యూటీకి అది పెద్ద ఎదురుదెబ్బే. మధ్యలో ఆరోపణలు, అపవాదులు.. చివరకు జైలు జీవితం.. దీనికితోడు డ్రగ్స్ కేసు, మొత్తంగా రియా జీవితమే తలక్రిందులైంది. ఎలాగోలా బెయిల్ పై బైటికి వచ్చాకా, కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండాపోయి, రీసెంట్ గానే మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది.

    Also Read: ప్లీజ్.. బాలయ్యతో ఒప్పుకోండి !

    కానీ, ఛాన్స్ లు మాత్రం అమ్మడుకు పెద్దగా రావడం లేదు. రాకపోతే రాకపోనీయి. కనీసం వచ్చిన ఛాన్స్ ల్లో కూడా అవమానం ఎదురైతే ఎలా ? ఆమె నటించిన ఓ సినిమా పోస్టర్ లో ఆమె ఫేస్ ని కూడా వాడేందుకు ఆ మూవీ మేకర్స్ ఆసక్తి చూపట్లేదు. ఆ సినిమానే ‘చెహ్రా’. ఈ సినిమా విడుదలకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హస్మి వంటి పాపులర్ నటులున్నా.. రియా చక్రవర్తి కూడా ఒక మెయిన్ హీరోయినే. అలాంటిది తన పేస్ ను కూడా పోస్టర్ లో వేయకపోవడంతో రియా ఫీల్ అయిందట.

    Also Read: దీపికా పదుకొనెకు చేదు అనుభవం నలిపేసిన ఫ్యాన్స్.. అరిచిన హీరోయిన్‌!

    అయినప్పటికీ మేకర్స్ మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు. పాపం, పోస్టర్ నుంచే తనను తీసేశారంటే… ఇక సినిమాలో కూడా తన సీన్లు లేకుండా చేస్తారా ? అనే భయం పట్టుకుంది రియాకి ప్రస్తుతం. సినిమాలో గనుక తన పాత్ర నిడివి తగ్గిస్తే మాత్రం మీడియాకి ఎక్కుతా అన్నట్లు మేకర్స్ కి ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చిందట ఈ బ్యూటీ. అయితే మీడియా ఆమె వెంటపడినా.. ఆమె మాత్రం మీడియాతో మాట్లాడటం లేదు.