https://oktelugu.com/

ప్చ్.. ప్రేమ దెబ్బలకు మారిపోయిన భారీ బ్యూటీ !

అందంతో పాటు అదృష్టం ఉన్నా స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది ‘నికీషా పటేల్’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కొమరం పులిలో హాట్ హాట్ యాక్టింగ్ తో అలరించిన ఈ భామకు, ఆ తరువాత కాలం కలిసి రాలేదు. చివరకు పవన్ భక్తుడు షకలక శంకర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సైడ్ పాత్ర కూడా చేసింది నికీషా. అంతగా దిగజారిపోయాక ఇక ఇండస్ట్రీకి స్వస్తి చెప్పింది. అయితే, ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ […]

Written By:
  • admin
  • , Updated On : June 10, 2021 / 05:55 PM IST
    Follow us on

    అందంతో పాటు అదృష్టం ఉన్నా స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది ‘నికీషా పటేల్’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కొమరం పులిలో హాట్ హాట్ యాక్టింగ్ తో అలరించిన ఈ భామకు, ఆ తరువాత కాలం కలిసి రాలేదు. చివరకు పవన్ భక్తుడు షకలక శంకర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సైడ్ పాత్ర కూడా చేసింది నికీషా. అంతగా దిగజారిపోయాక ఇక ఇండస్ట్రీకి స్వస్తి చెప్పింది.

    అయితే, ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సమాజంలో ప్రేమ గీమ జాంతానై అంటూ ప్రేమ సూక్తులు చెబుతుంది. తన దృష్టిలో ప్రేమించడం అనేది పక్కా టైమ్ వేస్ట్ వ్యవహారం అని, అలాంటి దిక్కుమాలిన పని మరొకటి లేదని చెబుతుంది. పైగా ప్రేమ ఒక్కటే కాదు, రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేయడం కూడా దండగ అంటుంది.

    “ప్రేమ, రిలేషన్ షిప్ లాంటివి మనిషి జీవితానికి పెద్ద మైనస్ అని, నా విషయంలో అయితే ప్రేమ ఎక్కువ సేపు నిలిచేది కాదు అని, తన జీవితంలోని చేదు అనుభవాలను కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది నికీషా. ప్రస్తుతం నేను నమ్మే వాటిల్లో ప్రముఖమైనది ఏమైనా ఉంది అంటే అది ఇదే. ‘లవ్ అనేది పెద్ద బోరింగ్’. నేను ఈ విషయాన్ని గట్టిగా ఒత్తి చెప్పగలను’ అని నికీషా ఎమోషనల్ కూడా అయింది.

    పాపం నికీషా పటేల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడింది. వాటిన్నటి ఫలితంగా ఈ భారీ బ్యూటీ మైండ్ సెట్ ఇలా మారింది. ఇలా ప్రేమ పై తనకంటూ ఓ వైవిధ్యమైన అభిప్రాయాన్ని సృష్టించుకుంది. జీవితంలో నికీషాకు ప్రేమ దెబ్బ గట్టిగా తగలడం వల్లే ఆమె ఇలా మారింది. ఒక్కటి అయితే నిజం, ప్రేమ గురించి చెప్పమంటే హీరోయిన్లు మాత్రమే చెప్పగలరు.