Homeఎంటర్టైన్మెంట్Pushpa Villan: ‘పుష్ప’ విలన్ భీకర లుక్ రిలీజ్.. ఫహద్ ఫస్ట్ ఎంట్రీ

Pushpa Villan: ‘పుష్ప’ విలన్ భీకర లుక్ రిలీజ్.. ఫహద్ ఫస్ట్ ఎంట్రీ

అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చి దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ‘పుష్ప’. రెండుపార్టులుగా తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

పుష్పలో బన్నీని ఢీకొట్టే విలన్ గా మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. అతడికి ఇదే తొలి టాలీవుడ్ మూవీ. పుష్పలో విలన్ గా చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో తలపడే వ్యక్తిగా సినిమాలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ కు మలయాళంలో ఉన్న మార్కెట్ కు అనుగుణంగా అక్కడి నటులకు సినిమాలో ఖచ్చితంగా చోటు కల్పిస్తున్నారు.

తాజాగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో చేరాడని.. విలన్ పాత్రలో అతడి ఫస్ట్ లుక్ ను నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ట్విట్టర్ లో విడుదల చేసింది. సోషల్ మీడియాలో ‘పుష్ప’ విలన్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ చూపించింది. పుష్పలో ‘భన్వర్ లాల్ షేకావత్’ అనే ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ నటించనున్నాడని రివీల్ చేశారు.

పోస్టర్ చూస్తే భీకరంగా కనిపిస్తోంది. పూర్తిగా గుండు చేసుకొని మీసాలతో పోలీస్ యూనిఫాం ధరించి పోలీస్ స్టేషన్ లో సీరియస్ గా చూస్తున్న ఫహాద్ లుక్ ఆకట్టుకుంది.

మలయాళ సినిమాల్లో విలక్షణ పాత్రలను పోషించడంలో ఫహద్ కు మంచి పేరుంది. తాజాగా అతడిని పుష్ప సినిమాలో విలన్ గా తీసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఫహద్ ను భీకర గెటప్ లో చూపించి దర్శకుడు సుకుమార్ ఓ రకంగా షాకిచ్చారు. మునుపెన్నడూ పోషించని క్యారెక్టర్ లో ఫహద్ ఇందులో కనిపిస్తున్నాడు. గుండు లుక్ లో షాకిచ్చేలా ఉన్నాడు.

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తోంది.దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏపీ, కేరళలోని దట్టమైన అడవుల్లో సాగుతోంది.

https://twitter.com/MythriOfficial/status/1431478116728205314?s=20

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper
Exit mobile version