https://oktelugu.com/

అమ్మాయిలను బతకనివ్వరురా అంటున్న నందిత శ్వేత

‘రేప్‌ చేస్తారు… ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరురా?’ అని ప్రశ్నిస్తోంది యువ నటి నందితా శ్వేత. నిఖిల్‌ సిద్దార్థ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైందామె. ఫస్ట్‌ మూవీతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది . ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘కల్కీ’లో చిన్న పాత్రలు చేసిందీ బెంగళూరు చిన్నది.‘బ్లఫ్‌ మాస్టర్’, ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రావడం లేదు. ఒకవైపు తమిళ్‌, […]

Written By:
  • admin
  • , Updated On : July 3, 2020 / 02:36 PM IST
    Follow us on


    ‘రేప్‌ చేస్తారు… ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరురా?’ అని ప్రశ్నిస్తోంది యువ నటి నందితా శ్వేత. నిఖిల్‌ సిద్దార్థ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైందామె. ఫస్ట్‌ మూవీతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది . ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘కల్కీ’లో చిన్న పాత్రలు చేసిందీ బెంగళూరు చిన్నది.‘బ్లఫ్‌ మాస్టర్’, ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రావడం లేదు. ఒకవైపు తమిళ్‌, కన్నడలో నటిస్తూనే తెలుగులో పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రూటు మార్చి హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ మూవీకి ఓకే చెప్పింది.

    ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘ఐపీసీ 376’. రామ్‌కుమార్ సుబ్బరామన్‌ దర్శకత్వంలో ఎస్‌. ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నందిత పవర్ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మూవీ ట్రైలర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌. తమన్‌ రిలీజ్‌ చేశారు. సైన్స్‌ గొప్పతనాన్ని చెప్పే థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య సంఘటనలు, అతీంద్రీయ శక్తులు, దెయ్యల ఉనికి గురించి, మహిళలపై జరిగే అత్యాచారల బ్యాక్‌ డ్రాప్‌లో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఖాకీ డ్రెస్‌లో విలన్లతో ఫైటింగ్‌ చేయడంతో పాటు చీరకట్టుకొని అచ్చతెలుగు ఆడపిల్లలా రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నందిత నటిస్తోంది. ట్రైలర్ చివర్లో రేప్‌ చేస్తారు… ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరురా?’ అని నందిత చెప్పే డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. కాగా, తెలుగుతో పాటు తమిళ్‌లో విడుదల కానున్న ఈ మూవీకి యాదవ్‌ రామలిక్కన్‌ సంగీతం అందిస్తున్నారు.