https://oktelugu.com/

ఉద్యోగులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూడా ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కార్యకలాపాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యోగులు కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి ఉద్యోగులను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజూవారీ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 3, 2020 / 08:17 PM IST
    Follow us on


    కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూడా ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కార్యకలాపాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యోగులు కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి ఉద్యోగులను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

    ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజూవారీ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్ని స్కరిళ్ల జనరల్‌ మేనేజర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ హెచ్చరికలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులకు సేవాలందించడం కోసం ఎస్.బి.ఐ ఉద్యోగులు సిద్ధంగానే ఉంటారని ఉద్యోగుల సంగం నాయకులు చెబుతున్నారు.