RGV Tweets On Rajamouli: రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ గురించి కూడా ఒక ట్వీట్ పెట్టాడు. బాహుబలితో ‘ఆర్ఆర్ఆర్’ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని వర్మ కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ‘ఆర్ఆర్ఆర్’ అనేది చారిత్రాత్మకం’ అంటూ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. అలాగే వర్మ.. రాజమౌళి గురించి కూడా ట్వీట్ చేస్తూ.. ‘దర్శకుడు రాజమౌళి బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థం వచ్చేలా ఆర్జీవీ మరో కామెంట్ పెట్టాడు.
అయితే, తాజాగా సినిమా చూసి ఇప్పుడు మరో ట్వీట్ పెట్టాడు. ‘నేను మామూలుగా ఏ విషయం మాట్లాడినా చాలా స్పష్టతతో మాట్లాడతాను. కానీ మొదటిసారి నాకు మాటలు రావడం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు ఒకటే చెప్పాలని ఉంది. ఫేమ్, స్టాటస్ ఇవన్నీ మరచిపోయి సినిమా చూశాను నేను. ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. రాజమౌళి ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఈ సినిమా బావుంటుందని నేను కూడా నమ్మాను.
కానీ, సినిమా చూశాక ఇదొక అద్భుతం అని అర్థమైంది. అసలు నాకు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు అంటేనే.. జీవితంలో మొదటిసారి నాకు మాటలు దొరకడం లేదు. సినిమా చూస్తున్నంత సేపు ఈ సినిమా కథేంటి ? అలాగే ఈ సినిమా క్యారెక్టర్లు ఏమిటి ? ఎవరు నటించారు ? అనేదాని కన్నా దర్శకుడు కథ చెప్పిన విధానం, స్క్రీన్ పై సినిమాని చూపించిన తీరు నన్నెంతగానో చాలా బాగా ఆకట్టుకున్నాయి.
Also Read: RRR Day-3 Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ మూడో రోజు కలెక్షన్స్ !
రామ్ చరణ్ పాత్ర చాలా బావుంది. ఎన్టీఆర్ పాత్ర ఇంకా బావుంది అనేవి అనవసరమైన మాటలు. పాత్రలకు తగ్గట్లు ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అద్భుతంగా నటించారు. కానీ 30 ఏళ్లలో ఇంతగా ఏ సినిమాని నేను ఎంజాయ్ చేయలేదు అంటే..రాజమౌళి పనితనం ఎంత గొప్పగా ఉందో అర్ధం అవుతుంది. అందుకే రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం. సినిమానే కలగా చేసుకుని మంచి సినిమాలు చేస్తున్నావు.
దానికి సినీ ప్రేమికులు ఎంతగానో ఆనందిస్తున్నారు’’ అంటూ వర్మ వాయిస్ లెటర్ లో పోస్ట్ పెట్టడం విశేషం. ఏది ఏమైనా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేసుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. గొప్ప టాలెంట్ ఉన్న వర్మ ఇలా ఒక డైరెక్టర్ ను పొగుడుతూ ట్వీట్ చేయడం చాలా అరుదు. అయినా, వర్మ ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరిని ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు.
Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?
Recommended Video: