దారిన పోయే వారి కన్నా ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్జీవీ. అంతేగాని, దారిన పోయే దానయ్యలను, లేక పని చేసుకునే పాపయ్యలను ఆర్జీవీ పట్టించుకోడు. అసలు ఆర్జీవీ నిజంగానే పతనం అయ్యాడా ? నిజానికి ఆర్జీవీ సూపర్ హిట్స్ తీసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు తీస్తున్న నాసిరకపు సినిమాల విషయంలో కూడా అలాగే ఉన్నాడు.
ఆర్జీవీ సినిమాలు చేయడాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తాడు. ఆ సినిమా ఫలితాన్ని కాదు. గతంలో తీసిన సినిమాల విషయంలో ఆర్జీవీ వెనుక బలమైన టీమ్ ఉండేది. ఆ టీమ్ పోయినప్పటి నుండి ఆర్జీవీ సినిమాల్లో పస తగ్గుతూ వచ్చింది. ఆర్జీవీ కూడా ఎక్కువగా ఇదివరకు పెట్టిన ఫోకస్ ను పెట్టలేకపోతున్నాడు. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే.
అయితే,ప్రపంచంలో మనకి అర్ధం కాని పనులు చేస్తున్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ లేక పతనమయ్యారు అనుకుంటే.. అది పొరపాటే. ఒక్కటి మాత్రం నిజం.. ఇండస్ట్రీ లోకి కొత్త కొత్త కెమెరాలను వాడే వ్యక్తి ఆర్జీవీనే. అలాగే ఇండస్ట్రీ ‘ఇగో’లతో అవుట్ ఫుట్ దెబ్బ తినే రోజుల్లో అఫీస్ బాయ్ చేత కూడా పేరు పెట్టి పిలిపించుకుని ఇగో అనే ఐటమ్ విషయంలో చాలా మార్పులు తెచ్చిన వ్యక్తి ఆర్జీవీ.
ఇక సినిమా డిస్ట్రిబ్యూషన్ లో కూడా శాటిలైట్ రైట్స్ లాంటివి రావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తుల్లో ఆర్జీవీ కూడా ఒకడు. ఇప్పటికి ఎప్పటికి కెమెరా పెట్టే యాంగిల్ మీద, స్క్రీన్ ప్లే మీద ఆర్జీవీ చేసిన ప్రయోగాలు ఇండస్ట్రీ లో మరో దర్శకుడు చేయలేదు. అందుకే ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ఎప్పుడు సక్సెసే.