https://oktelugu.com/

Raja Vikramarka Teaser: ఊరికే చంపేస్తోన్న హీరో కార్తికేయ.. కారణమేంటి?

Raja Vikramarka Teaser: యంగ్ ఫైర్ హీరో కార్తికేయ మరో చిత్రంతో మనముందుకు వచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘రాజ విక్రమార్క’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇది ఉత్కంఠ రేపేలా ఉంది. టీజర్ చూస్తే ఊరికే ఫస్ట్ సీన్ లోనే తుపాకీతో ఓ వ్యక్తిని కాల్చేస్తాడు హీరో కార్తికేయ.. ఆ తర్వాత స్టైలిష్ యాక్షన్ షాట్ లు పెట్టారు. కార్తికేయ ఈ సినిమాలో ఎన్.ఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా టీజర్ ను బట్టి తెలుస్తోంది. రాజ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2021 / 12:16 PM IST
    Follow us on

    Raja Vikramarka Teaser: యంగ్ ఫైర్ హీరో కార్తికేయ మరో చిత్రంతో మనముందుకు వచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘రాజ విక్రమార్క’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇది ఉత్కంఠ రేపేలా ఉంది.

    టీజర్ చూస్తే ఊరికే ఫస్ట్ సీన్ లోనే తుపాకీతో ఓ వ్యక్తిని కాల్చేస్తాడు హీరో కార్తికేయ.. ఆ తర్వాత స్టైలిష్ యాక్షన్ షాట్ లు పెట్టారు. కార్తికేయ ఈ సినిమాలో ఎన్.ఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా టీజర్ ను బట్టి తెలుస్తోంది.

    రాజ విక్రమార్క అనే ఎన్ఐఏ అధికారి చుట్టూ నడిచే యాక్షన్ మూవీగా ఇది తెలుస్తోంది. టీజర్ చూస్తే చాలా రిచ్ గా బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయేలా ఉంది. కథ మంచి థీమ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

    శ్రీసరిపల్లి దర్శకత్వం వహించిన ‘రాజా విక్రమార్క’ మూవీని ఒక యాక్షన్ డ్రామాగా తీసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 88 రామారెడ్డి నిర్మించారు.

    కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రంలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆదిరెడ్డి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు..

    టీజర్ ను కిందచూడొచ్చు.