RGV meeting: ఏపీ మంత్రితో ఆర్జీవీ భేటీ.. కీలక మలుపు తిరగనుందా?

RGV Meeting: కరోనాతో గత రెండుళ్లుగా సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెల్సిందే. థియేటర్లు మూతపడగా షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే సినిమా రంగం గాడిన పడుతోంది. కాగా ప్రస్తుతం ఏపీలో నైట్ కర్వ్యూ విధించడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి మళ్లీ కష్టాలు మొదలైనట్లు కన్పిస్తోంది. కరోనాతో దెబ్బతిన్న టాలీవుడ్ ను ఆదుకోవాల్సిపోయి ఇందుకు భిన్నంగా వ్యవహరించడంపై […]

Written By: Raghava Rao Gara, Updated On : January 10, 2022 10:51 am
Follow us on

RGV Meeting: కరోనాతో గత రెండుళ్లుగా సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెల్సిందే. థియేటర్లు మూతపడగా షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే సినిమా రంగం గాడిన పడుతోంది. కాగా ప్రస్తుతం ఏపీలో నైట్ కర్వ్యూ విధించడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి మళ్లీ కష్టాలు మొదలైనట్లు కన్పిస్తోంది.

కరోనాతో దెబ్బతిన్న టాలీవుడ్ ను ఆదుకోవాల్సిపోయి ఇందుకు భిన్నంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ గతంలో ఎప్పుడో ఉన్న సినిమా యాక్ట్ ను తీసుకొచ్చి సినిమా టికెట్ల రేట్లను కట్టడి చేయడంతో ఇండస్ట్రీని పిడుగుపాటుకు గురిచేసింది. ఏపీ సర్కారు నిర్ణయించిన రేట్లు మరీ తక్కువగా ఉండటంతో కరెంటు బిల్లులు, జీతాలు, థియేటర్ల నిర్వాహణ కష్టంగా మారింది. ఈ విషయాన్ని పలువురు సినీ పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమను కనుకరించాలని విజ్ఞప్తి చేశారు.

మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, పలువురు నిర్మాతలు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఈక్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ ఆగ్రహాన్ని ప్రభుత్వంపై చూపిస్తున్నారు. ఏపీ మంత్రులు సైతం వాళ్లకు కౌంటర్లు ఇస్తుండటంతో ఏపీ సర్కార్ వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎంటరయ్యాడు. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై మీడియాలో డిబేట్లు, సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ పది ప్రశ్నలను ట్వీటర్లో స్పందించారు. దీనికి ఆయన కూడా సమాధానం ఇచ్చారు.

ఈ సంభాషణలో భాగంగా ఏపీ మంత్రి ఆర్జీవీని తనతో భేటి అయ్యేందుకు ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆర్జీవీ నేటి మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో భేటి కానున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి మంత్రితో బేటి కానున్నారు.

అయితే ఆర్జీవీ తన లాజిక్కులతో ఏపీ ప్రభుత్వాన్ని ఏమేరకు ఒప్పించగలరనేది ఆసక్తిని రేపుతోంది. మీడియా సైతం ఈ భేటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు చిరంజీవి, నాగార్జునలను పెద్దగా పట్టించుకోని ఏపీ సర్కారు ఆర్జీవీ మాటలను వింటుందా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. ఈ భేటి తర్వాత అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది అంతవరకు వెయిట్ చేయాల్సిందే..!